Virat kohli vs Gautam Gambhir: ఫైట్.. 100% మ్యాచ్ ఫీజ్ కట్
Virat kohli vs Gautam Gambhir: ఐపీఎల్-16వ సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఘటనలపై ఐపీఎల్ నిర్వహకులు చర్యలకు ఉపక్రమించారు. మ్యాచ్ సందర్భంగా మైదానంలోనే గొడవపడ్డ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ- లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్‌లకు భారీ జరిమానా విధించారు. వీరి గొడవకు పరోక్షంగా కారణమైన లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్‌పై సైతం ఫైన్ పడింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 2 ఆర్టికల్ 2.21 కింద విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మ్యాచు ఫీజులో 100 శాతం, నవీన్ ఉల్ హక్ మ్యాచు ఫీజులో 50 శాతం కోత విధించారు ఐపీఎల్ నిర్వహకులు.
సోమవారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి రివేంజ్ తీర్చుకునేందుకు ఛాన్స్ వచ్చింది. మ్యాచ్ ప్రారంభం నుండి అగ్రెసివ్‌గా కన్పించిన కోహ్హీ అవకాశం వస్తే చాలు సెలబ్రేషన్స్ డోసును పెంచాడు. ఈ మ్యాచ్‌లో ఆయుష్ బదోని క్యాచ్ అందుకున్న తర్వాత కోహ్లీకూడా గంభీర్‌లాగే ష్ గప్‌చుప్ అంటూ ముక్కుపై వేలువేసుకొని కవ్వించాడు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు అదే తీవ్రతతో సంబరాలు చేసుకున్న కోహ్లీ జట్టు వికెట్ కోల్పోయిన ప్రతీసారీ అగ్రెసివ్‌గా కనిపించాడు.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ- గంభీర్‌ల మధ్య పరుష పదజాలం, సైగలతో వార్, కోహ్లీ రివ్యూకు గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో. దీంతో విరాట్ కోహ్లీ తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. దీనితో కాసేపు వాగ్వాదం జరిగింది. ఇద్దరినీ విడిపించేందుకు ఇతర ఆటగాళ్లు ప్రయత్నించారు. కేఎల్ రాహుల్ , అమిత్ మిశ్రా వారిద్దరినీ విడిపించి దూరంగా తీసుకెళ్లడంతో సద్దుమణిగింది. అంతే కాకుండా పరిస్థితి చేయి దాటిపోవడంతో ఇరు జట్ల ఆటగాళ్లు మధ్యలోకి ప్రవేశించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే నిన్న లక్నోను సొంతగడ్డపై ఓడంచిన కోహ్లీ.. గంభీర్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు ఈ మ్యాచ్‌లో తమ ప్రవర్తనతో ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఐపీఎల్ యాజమాన్యం చర్యలు తీసుకుంది. కోహ్లీ, గంభీర్ మ్యాచు ఫీజులో 100శాతం, నవీన్ ఉల్ హక్ మ్యాచు ఫీజులో 50 శాతం కట్ చేసింది.