TS Inter: జూన్‌ 12 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

TS Inter

TS Inter: జూన్‌ 12 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

TS Inter: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ మే9వ తేదీన ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను బోర్డు విడుదల చేసింది.

జూన్ 12 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.అయితే మొదట జూన్ 4 నుంచి  జూన్‌ 4 నుంచి 9వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు ప్రకటించారు.

Also Watch

IPL 2023 DC vs PBKS: టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకున్నా

అయితే జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ఆ తర్వాత ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో వారం రోజులపాటు వాయిదా వేసినట్లు చెబుతున్నారు. పరీక్షలు 12న ప్రారంభమై జూన్‌ 22తో ముగుస్తాయి.

అయితే పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9-12 గంటల వరకు ప్రథమ సంవత్సరం,  మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయని అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తు గడువు ఈనెల 19 వరకు ఉంది.

అలాగే గతంలో ప్రయోగ పరీక్షలకు హాజరుకాని ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్‌ 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఉదయం 9-12 గంటలు, మధ్యాహ్నం 2-5 గంటల వరకు రోజుకు రెండు విడతలుగా ఉంటాయి.

ప్రథమ సంవత్సరంలో నైతికత, మానవీయ విలువల పరీక్షలు రాయని విద్యార్థులకు జూన్‌ 21న, పర్యావరణ విద్య పరీక్షను 22న నిర్వహిస్తారు.

ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ షెడ్యూల్

  • 12-06-2023(సోమవారం) : సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
  • 13-06-2023(మంగళవారం) : ఇంగ్లీష్ పేపర్-1
  • 14-06-2023(బుధవారం): మ్యాథమెటిక్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
  • 15-06-2023(గురువారం): మ్యాథమెటిక్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ-1
  • 16-06-2023(శుక్రవారం) : ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ -1
  • 17-06-2023(శనివారం) : కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్ -1

19-06-2023 (సోమవారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1 , మ్యాథ్స్ పేపర్-1(BiPC విద్యార్థులకు)  ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి.

  • 20-06-2023(మంగళవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1

ఇంటర్ సెకండియ్ సప్లిమెంటరీ షెడ్యూల్

  • 12-06-2023(సోమవారం) : సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
  • 13-06-2023(మంగళవారం) : ఇంగ్లీష్ పేపర్-II
  • 14-06-2023(బుధవారం): మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
  • 15-06-2023(గురువారం): మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ-II
  • 16-06-2023(శుక్రవారం) : ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ -II
  • 17-06-2023(శనివారం) : కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్ -II
  • 19-06-2023 (సోమవారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -II , మ్యాథ్స్ పేపర్-II(BiPC విద్యార్థులకు)
  • 20-06-2023(మంగళవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-II, జాగ్రఫీ పేపర్-II
  • 21-06-2023 (బుధవారం ) ఉదయం 00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 వరకు ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్ పేపర్
  • 22-06-2023 (గురువారం) ఉదయం 00 నుంచి మధ్యాహ్నం 1.00 వరకు ఎన్విరాన్మెంటల్ ఎక్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారు.
  • ప్రతి రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh