Sun Stroke: వడ దెబ్బతో ముగ్గురు మృతి
Sun Stroke: తెలుగు రాష్ట్రాలపై భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భగ భగ మండే ఎండల కారణంగా ఉదయ 10 గంటలు దాటాక బయటికి రావాలంటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల దేశంలోని అన్ని ప్రాంతాలు ఉడికిపోయాయి. వారం రోజుల వ్యవధిలోనే ఎండ తీవ్రత అమాంతం పెరి గింది. అలాగే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు సతమతమవుతున్నారు. అనారోగ్యాలకు గురవుతున్నారు. ఎండల తీవ్రతకు పలువురు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరించింది.
మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. విదర్భ, మరాఠ్వాడాలో 20 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.https://pregnyamedia.com/sports/injured-hussamuddin-settles-for-bronze-at-world-boxing-championships/
అయితే ముఖ్యంగా వడగాడ్పులు వీస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. వీరిలో జల్‌గావ్ జిల్లాలోని రావేర్‌లోని నమ్రతా చౌదరి, అమల్‌నేర్‌లోని రూపాలి రాజ్‌పుత్ ఉండగా.. నాందేడ్ జిల్లాలోని విశాల్ మాదస్‌వార్ ఉన్నారు. ఈ ముగ్గురు వడదెబ్బతోనే మృతి చెందినట్లు సంబంధిత డాక్టర్లు తెలిపారు. ఈ వార్త భయాందోళనతోపాటు విషాదాన్ని నింపింది. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
వడదెబ్బ తగిలినప్పుడు శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. 40 డిగ్రీల సిల్సీయస్ అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత పెరుగుతుంది. చాలా సమస్యలను కలిగిస్తుంది. వడదెబ్బ అత్యంత ప్రమాదకరం దీనిపై శ్రద్ధ తీసుకోవాలి. వెంటనే చికిత్స చేయించుకోవాలి. నిర్లక్ష్యంతో చికిత్స చేయకుండా వదిలేస్తే మెదడు, గుండె, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. చికిత్స చేయించుకోవడం వాయిదా వేసినా లేదా ఆలస్యం చేసినా వడదెబ్బ బాధితుల ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతుంది. సంక్లిష్టంగా మారి ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే ఒకవేళ మరణం కూడా సంభవించవచ్చు.