The Kerala Story: ది కేరళ స్టోరీ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయశాంతి
The Kerala Story: రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన ది కేరళ స్టోరీ (The Kerala Story) మూవీ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. ఈ సినిమాపై పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. మే 5న ఈ సినిమా విడుదల కాగా.. దీనిపై జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూపై తాజాగా బీజేపీ నేత విజయశాంతి (Vijayashanthi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ది కేరళ స్టోరీ రచ్చపై సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ది కేరళ స్టోరీ సినిమాపై కొనసాగుతున్న చర్చలు, వాదవివాదాలు, నిరసనలను గమనిస్తుంటే ఒక విషయం బాగా అర్థమవుతోంది. ఏ సినిమా అయినప్పటికీ, దానిని చూడాలా వద్దా..? అందులోని అంశాలు నిజమా, కాదా? అనేది ప్రజలు తమ విజ్ఞతతో తెలుసుకోవాల్సిన విషయం కాగా.. ప్రజలకు ఉన్న ఆ విజ్ఞతని కొన్ని వర్గాలు, చివరికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ చేతుల్లోకి లాక్కోవడం దురదృష్టకరం అని పేర్కొంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది విజయశాంతి.
సెన్సార్‌షిప్ పూర్తి చేసుకున్న ది కేరళ స్టోరీ సినిమాకు వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లని కోర్టులు సైతం పక్కన పెట్టినప్పుడు ఆ సినిమాని ప్రజలకి దూరం చేసే హక్కు ఎవరికుంది? అని విజయశాంతి ప్రశ్నించింది. మనది ప్రజాస్వామిక దేశం. జనం తమ విజ్ఞతతో ప్రభుత్వాలనే ఎన్నుకుంటున్న రోజుల్లో ఒక సినిమాని చూసి, అందులో ఏ అంశాల్ని స్వీకరించాలో వేటిని తిరస్కరించాలో ప్రజలకి తెలియదని అనుకుంటున్నారా? చివరికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆ వర్గాలకి భయపడి సినిమా ప్రదర్శనకు ఆటంకాలు సృష్టించడం దారుణం అంటూ మండిపడింది విజయశాంతి.
ఈ మూవీ లో ప్రముఖ నటి అదా శర్మ నటిస్తున్న ది కేరళ స్టోరీని సన్‌షైన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది. ఈ సినిమాకు విపుల్ అమృత్లాల్ షా.. నిర్మాత, క్రియేటివ్ డైరక్టర్, కో-రైటర్‌గా పనిచేశారు. ఈ చిత్ర రచయిత సుదిప్తో సేన్.. గతంలో ఆస్మా, ది లక్నో టైమ్స్, ది లాస్ట్ మాంక్ వంటి చిత్రాలకు పనిచేశారు.
ది కేరళ స్టోరీ సినిమాపై కొనసాగుతున్న చర్చలు, వాదవివాదాలు, నిరసనలను గమనిస్తుంటే ఒక విషయం బాగా అర్థమవుతోంది. ఏ సినిమా అయినప్పటికీ, దానిని చూడాలా వద్దా?… అందులోని అంశాలు నిజమా, కాదా? అనేది ప్రజలు తమ విజ్ఞతతో తెలుసుకోవాల్సిన విషయం కాగా…. pic.twitter.com/f0lIuk9Zby
— VIJAYASHANTHI (@vijayashanthi_m) May 9, 2023