University: వీసీ కొత్త పాలకమండలి నియామకం

University

University: వీసీ కొత్త పాలకమండలి నియామకం

University: తెలంగాణ యూని వర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ తో పాటు మిగిలిన యూనివర్సిటీల్లో పాలకమండళ్లలో వైస్‌ చాన్సిలర్లు తీసుకునే నిర్ణయాలు, జారీ చేసే సర్క్యులర్లతో ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. అలాంటి వారిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మొట్టికాయలు వేసినా వారి తీరు మాత్రం మారడంలేదనే విమర్శలు వినిపిసు ్తన్నాయి. అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఒకటికి రెండు సార్లు హెచ్చరించినా పలువురు వీసీలు మాత్రం తమ తీరు ఇంతే అన్నట్లుగా సాగిపోతున్నారు. అయితే పలువురు వీసీలు తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నప్పటికీ మరికొంత మంది వీసీలు తీసుకునే నిర్ణయాలు, విధానాలు మాత్రం నిత్యం వివాదాస్పదం అవుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ University వీసీ రవీందర్‌ గుప్తా తీరు ఉన్నతాధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నట్లుగా తెలుస్తోంది.

నిజామాబాద్ లోని తెలంగాణ విశ్వవిద్యాలయం పరిపాలనను పర్యవేక్షించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది.

తెలంగాణ University వీసీగా రవీందర్‌ గుప్తా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోనే ముగ్గురు రిజిస్ట్రార్లు మారారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించారని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ) ఇందుకు అప్పటి రిజిస్ట్రార్‌ కనకయ్యను బాధ్యుడిగా చేస్తూ పదవీ బాధ్యతల నుంచి తప్పించి, సీనియర్‌ ప్రొఫెసర్‌ యాదగిరిని నియమించింది. అయితే అప్పట్లో జరిగిన నియామకాలను రద్దు చేసింది. తర్వాత యాదగిరి స్థానంలో కొత్త రిజిస్ట్రార్‌గా శివకుమార్‌ వచ్చారు. ఈయన తర్వాత మహిళా ప్రొఫెసర్‌ను రిజిస్ట్రార్‌గా నియమించారు. ఈమె నియామకం చెల్లదని ఇటీవల జరిగిన ఈసీలో తేల్చడంతో తాజాగా వర్సిటీ కొత్త రిజిస్ట్రార్‌గా యాదగిరి గురువారం బాధ్యతలు స్వీకరించినట్లు తెలిసింది. అలాగే వీసీ హయాంలో గతంలో నియమించిన దాదాపు 130 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. పదోన్నతు లను కూడా రద్దు చేశారు. రెండు నెలల పాటు ప్రతి వారం ఈసీ సమావేశం నిర్వహించాలని University విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.

అయితే కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులను వివరించడానికి గుప్తా ఉన్నతాధికారులను సంప్రదించాలని నిర్ణయించుకున్నారు. ఈసీ కమిటీ సభ్యుల నిర్ణయాలపై న్యాయపోరాటం చేయాలని పలువురు విద్యావేత్తలు కోరుతున్నారు. అవసరాన్ని బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని, కార్యనిర్వాహక మండలి సమావేశంలో ఆమోదం పొందుతామని టీయూ వర్గాలు తెలిపాయి.

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh