Telugu: రాష్ట్రాల్లో ఐటీ సోదాలు

Telugu

Telugu: రాష్ట్రాల్లో ఐటీ సోదాలు

Telugu :తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేసి దాడులు చేస్తారో అర్ధం కాని పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈరోజు ఒక్కసారిగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. నిన్న మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ సంస్థలు, సినిమా రంగానికి చెందిన పలు నిర్మాణ సంస్థలలో దాడులు నిర్వహించిన ఐటి అధికారులు తాజాగా తెలుగు రాష్ట్రాలలోని వస్త్ర దుకాణాలపై ఫోకస్ పెట్టారు.చాలా షాపింగ్ మాల్స్ యజమానులు ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన ఆదాయపుపన్ను పెద్దమొత్తంలో ఎగరవేశారు అన్న ఆరోపణలపై సోదాలు నిర్వహిస్తున్నారు.

ఈ ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వస్త్ర దుకాణాలతో పాటు యజమానుల ఇళ్లల్లో తనిఖీలు చేస్తున్నారు. కళామందిర్‌తో పాటు వరమహాలక్ష్మి, కాంచీపురం, కేఎల్‌ఎం ప్యాషన్ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే హైదరాబాదు, విశాఖపట్నంతో పాటుగా విజయవాడలో కూడా ప్రస్తుతం ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. వైజాగ్ కు చెందిన పలువురు వ్యాపారుల ఇళ్లల్లో కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కళామందిర్ గ్రూప్ చైర్మన్, డైరెక్టర్ ఇళ్లల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే మరో షాప్ ఓనర్ కల్యాణ్ ఇంటితో పాటు డైరెక్టర్ ఇళ్లల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ కాక మొత్తం 20 కి పైగా ప్రాంతాలలో 40 బృందాలుగా విడిపోయిన అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. Telugu ఒక్క హైదరాబాద్ లోనే 40 చోట్ల ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ గచ్చిబౌలి మాదాపూర్ ప్రాంతాలలో సోదాలు కొనసాగుతున్నాయి.

అయితే సోదాలు పూర్తయిన అనంతరం ఐటీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది. ఒకేసారి 20 ప్రాంతాల్లో ఐటీ దాడులు జరుగుతుండటం కలకలం సృష్టిస్తోంది. గతంలోనూ కేఎల్‌ఎం షాపింగ్ మాల్‌పై ఐటీ దాడులు జరిగాయి. పెద్ద మొత్తంలో నిధుల మళ్లించినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఇప్పుడు మరోసారి ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశంగా Telugu  మారింది.

 

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh