Telangana: జీవో నెంబర్ 111 ఎత్తివేతకు కేబినెట్‌ ఆమోదం

Telangana:

Telangana: జీవో నెంబర్ 111 ఎత్తివేతకు కేబినెట్‌ ఆమోదం

Telangana: తెలంగాణ క్యాబినెట్ ఈరోజు సంచలన నిర్ణయం తీసుకుంది.

జీవో 111ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర కేబినెట్‌‌ నిర్ణయం తీసుకుంది.

ఇన్ని రోజు లు  ఆ జీవో పరిధిలో ఉన్న 84 గ్రామాలకు ఇక నుంచి హెచ్‌‌ఎండీఏ

పరిధిలోని గ్రామాల విధి విధానాలు, రూల్స్​ అమలవుతాయని  పేర్కొంది.

వీఆర్​ఏలందరినీ రెగ్యులరైజ్​ చేసేందుకు అంగీకరించింది.

గురువారం మధ్నాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్​ అధ్యక్షతన సెక్రటేరియెట్​లో కేబినెట్  సమావేశం జరిగింది.

దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు నిర్ణయాలను తీసుకున్నారు.

వాటిని మంత్రి హరీశ్​రావు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రం పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా

ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని కేబినెట్​లో నిర్ణయించినట్లు వెల్లడించారు.

దేశానికి మార్గదర్శకంగా తెలంగాణ ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని ఆయన అన్నారు.

ఒక్కో రోజు ఒక్కో రంగం మీద అన్ని జిల్లాల్లో , గ్రామాల్లో, నియోజకవర్గాల్లో అధికారికంగా ఉత్సవాలను జరుపుతామని చెప్పారు.

111 వన్ జీవో చేవెళ్ల, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లోని 84 గ్రామాల వ్యధ గుర్తుకు వస్తుంది.

లక్ష 32 వేల ఎకరాల భూమి కథ ఇది ఈ త్రిపుల్ వన్ జీవో.

చాలా మంది పెద్దమనుషులు పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఈ ప్రాంతం.

ఒక్కసారి Telangana: జీవో ఎత్తేస్తే అక్కడ జరిగే రియల్ ఎస్టేట్ రికార్డులు సృష్టిస్తోంది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1,32,000 ఎకరాల్లో విస్తరించి ఉంది GO.111.

ఏకంగా 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి.

కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు త్రిబుల్ వన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ పట్టణానికి నీరందించే జంట జలాశయాలు హుస్సేన్ సాగర్, హిమాయత్

సాగర్‌ను కాపాడేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకువచ్చింది.

ఈ జీవో పరిధిలో నిర్మాణాలు చేయడంపై నిషేధం విధించింది. వ్యవసాయం తప్ప

ఏ రంగానికి Telangana: ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. కానీ తెలంగాణ రాష్ట్రం

ఏర్పడ్డాక త్రిబుల్ వన్ జీవో ఎత్తి వేస్తామంటూ ఎన్నికల హామీలు ఇచ్చాయి రాజకీయ పార్టీలు.

దీంతో త్రిబుల్ వన్ జీరో పరిధిలో లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయి.

చాలా ఏళ్లుగా పోరాటంరెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల

నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు చిన్నాపెద్ద అంతా 111 జీవోలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు.

వెంచర్లు అక్రమ నిర్మాణాలతో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ భారీగా జరుగుతుంది.

111 జీవో ఎత్తివేయాలంటూ టీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కోర్టులో చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు.

సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు.

నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై పిడియాక్ట్ పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

అంతేకాదు మంత్రివర్గ భేటీలో కుల వృత్తుల బలోపేతం కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

జైన్ కమ్యూనిటీని మైనారిటీ కమిషన్ పరిధిలోకి తీసుకురావడానికి కేబినెట్ నిర్ణయించింది.

111 ఎత్తివేతకు కేబినెట్‌ ఆమోదం

అలాగే హెల్త్​ డిపార్ట్​మెంట్​లో  రీ ఆర్గనైజేషన్​పై కేబినెట్​ కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి హరీశ్​రావు చెప్పారు

. ‘‘కొత్త  జిల్లాలకు తగ్గట్టుగా  డీఎంఅండ్​హెచ్​ఓ పోస్టులు ​కు ఆమోదం తెలిపామ్ .

హైదరాబాద్​ జిల్లా చాలా పెద్దగా ఉంది ఇక్కడ కోటి మందికి ఒక్క డీఎంహెచ్​వో ఉండటంతో

హెల్త్​ కేర్​ను పూర్తిస్థాయిలో అందించలేకపోతున్నం. దీంతో హైదరాబాద్​ జీహెచ్​ఎంసీ ఆరుగురు జోనల్​

కమిషనర్లతో పనిచేస్తున్నట్లుగానే ఆరు డీఎం హెచ్​వో ఆఫీస్​లను క్రియేట్​ చేయాలని కేబినెట్​లో నిర్ణయం తీసుకున్నం.

వీటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 38 డీఎంహెచ్​వోలు ఉంటయ్​” అని వివరించారు.

కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో పీహెచ్​సీలను శాంక్షన్​ చేస్తూ కేబినెట్​ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు.

అర్బన్​ ప్రైమరీ హెల్త్​ సెంటర్స్ మొత్తం కాంట్రాక్ట్​ సిబ్బందితోనే పనిచేస్తున్నాయని, వీటిలో పర్మినెంట్​గా

స్టాఫ్​ను  నియమించాలని కేబినెట్​ నిర్ణయించిందని మంత్రి హరీశ్​ చెప్పారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh