టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్
హైదరాబాద్ లో త్వరలోనే మరో టీసీఎస్ కొత్త క్యాంపస్ ప్రారంభించనుంది. ఫైనాన్సియల్ డిస్టిక్ట్ వద్ద మరో 6 నెలల్లో ప్రాంగణం అందుబాటులోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. గతంలో హైదరాబాద్ కింద 4000 మంది ఉద్యోగులు ఉండగా, కానీ ప్రస్తుతం అటు ఆంద్రప్రదేశ్,ఇటు తెలంగాణ లో మెుత్తంగా 90,000 మంది పనిచేస్తున్నారు అని, రీజినల్ హెడ్ రాజన్న వెల్లడించారు. టీసీఎస్‌కు హైదరాబాద్ డెవలప్మెంట్ సెంటర్ రెండో అతిపెద్ద కేంద్రమని ఆయన వెల్లడించారు. ఏడాది కాలంలో కంపెనీ దాదాపు 10,800 మంది ఉద్యోగులను నియమించుకుంది. తాజాగా కొత్తగా అందుబాటులోకి వస్తున్న క్యాంపస్ ద్వారా 700 మందికి అవకాశం కల్పిస్తామని రాజన్న తెలిపారు. ఇక్కడి నుంచి కంపెనీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, తయారీ, రిటైల్, కమ్యూనికేషన్, పర్యాటకం, ఆతిథ్య రంగాలకు చెందిన 1300 మంది ఖాతాదారులకు సేవలను అందిస్తోంది అని. మారుతున్న సాంకేతికతల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్సిస్తున్నట్లు కూడా టీసీఎస్ వెల్లడించింది. కంపెనీ ఆఫర్ లెటర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని టీసీఎస్ ప్రతినిధి తెలిపారు. గడచిన ఏడాది ఇందులో భాగంగా 2100 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. ‘రిమోట్ ఇంటర్న్‌షిప్‘ పథకాన్ని 2600 మంది విద్యార్థులు వినియోగించుకున్నారని తెలిపారు. కంపెనీ ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, సెమీకండక్టర్లకు సంబంధించిన టెక్నాలజీలపై హైదరాబాద్ కేంద్రం దృష్టి కలిగించింది. ఇంటెలిజెంట్ డివైజెస్, హెటిరోజెనస్ కంప్యూటింగ్, 5జీ క్లౌడ్, ఐపీ నెట్వర్కింగ్లో పరిశోధనల కోసం 75వేల చదరపు అడుగుల కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: