Gudivada: నానీని జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా చేయాలి

Gudivada

Gudivada: నానీని జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా చేయాలి

Gudivada: కృష్ణ జిల్లా గుడివాడ నియోజక వర్గం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై మండిపడ్డారు ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్. నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై మండిపడ్డారు ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోధర్. బుధవారం గుడివాడ నియోజకవర్గ సమస్యలపై బిజెపి చార్జిషీట్ కార్యక్రమం నిర్వహించింది.

ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గాడిదలా, కుక్కలా బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మాటలతో ఏపీ పరువు పోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Watch

Ganguly: గంగూలీకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ..

తెలుగు వారికి విశిష్టత కలిగిన సంక్రాంతి పండుగను నాని క్యాసినో, క్యాబిరే డ్యాన్స్ లుగా మార్చేశారని సునీల్ దుయ్యబట్టారు. గుడివాడ యువతను సర్వనాశనం చేస్తున్న కొడాలి నానీని జీవితంలో అసెంబ్లీ గడప తొక్కకుండా చేయాలని గుడివాడ ప్రజలకు సునీల్‌ దియోధర్‌ విజ్ఞప్తి చేశారు.

అయితే రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే ఇలాంటి ఎమ్మెల్యేలను జైలుకు పంపుతామన్నారు. బూతులు మాట్లాడుతూ ఫేమస్‌ అయ్యాడని, ఇలాంటి ఎమ్మెల్యేల కారణంగా ఏపీ పరువుపోతోందన్నారు.

అనంతరం గుడివాడ సమస్యలపై వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో భాజపా నేతలు ఛార్జ్‌షీట్‌ ఫిర్యాదు చేశారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచి రాజకీయ వేడి కొనసాగుతుంది.

అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వ్యుహా, ప్రతివ్యుహాలతో ఇప్పటి నుంచే రానున్న ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

గత ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన టీడీపీ. ఈసారి  ఎలాగైనా అధికారంలోకి రావాలని  ప్రణాళికలు రచిస్తుంది.

మరోవైపు సంక్షేమం అజెండాగా ముందుకు సాగుతున్న  వైసీపీ మరోసారి అధికారాన్ని నిలుపుకునేలా పావులు కదుపుతుంది.

అయితే ఇరు పార్టీలు కూడా రాష్ట్రంలోని  కొన్ని నియోజకవర్గాల్లో గెలుపును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh