ఈ ఏడాది వివాహ ముహార్తాలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది పెళ్లి పెళ్లిపీటలెక్కేస్తున్నారు. ఈ మధ్య చాలా మంది సెలబ్రెటీలు పెళ్లిల్లు జరిగాయి కూడా. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడయ్యాడు. తాజాగా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సుమలత కుమారుడు అభిషేక్ అవివా బిడప్పా వివాహం ఘనంగా జరిగింది. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా ఈ వివాహంను నిర్వహించారు. ఈ వివాహ వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. బెంగళూరులో జరిగిన ఈ వివాహ వేడుకకు పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కన్నడ, తెలుగు, తమిళ స్టార్స్ పెళ్లి మండపంలో సందడి చేశారు. సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు, యశ్, దర్శన్‌తో పాటు పలువురు ఈ పెళ్లికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు.
అయితే అభిషేక్-అవివ ఇద్దరూ కొన్నేళ్ల క్రితం ఓ ప్యాషన్ ఈవెంట్లో కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్తా తర్వాతి కాలంలో స్నేహంగా మారింది. ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు తమ ప్రేమ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పి పెద్దలను ఒప్పించారు. గత డిసెంబర్ 11న వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ రోజు జరిగిన పెళ్లి వేడుకతో ఒక్కటయ్యారు. ఇక, అవివ విషయానికి వస్తే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అయిన ప్రసాద్ బీదపా కూతురు అవివా మీడియా ఎంటర్‌ప్రెన్యూర్‌గా అవివకు కన్నడనాట మంచి పేరుంది. మోడలింగ్.. ప్యాషన్ డిజైనింగ్‌లో కూడా ఆమె తన సత్తా చాటారు. ఆమె తల్లిదండ్రులు కూడా కన్నడనాట మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులే కావటం విశేషం.
ఒకప్పటి సీనియర్ హీరోయిన్లలో నటి సుమలత సౌత్ టు నార్త్ లో ఎన్నో భాషలలో నటించి దాదాపుగా 200 పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించింది. తెలుగు, తమిళ్, మలయాళం వంటి సినిమాలలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సుమలత చిరంజీవి ,రజనీకాంత్ ,బాలయ్య తదితర హీరోలతో నటించి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. సుమలత భర్త అంబరీష్ 2018లో మరణించిన విషయం తెలిసిందే. తెలుగులో చిరంజీవి నటించిన శ్రీ మంజునాథం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు అంబరీష్. అంబరీష్ కూడా సినిమాలపరంగా రాజకీయపరంగా మంచి పాపులారిటీ సంపాదించారు. దీంతో సుమలత కూడా భర్త బాటలోనే రాజకీయాల్లో కొనసాగుతోంది. ఆమె 2019 ఎన్నికల్లో కర్ణాటక లో మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీ గా గెలుపొందినది.