సినీ ఇండస్ట్రీలో మరో విషాదం: ప్రముఖ నటి కన్నుమూత
ప్రముఖ మలయాళ నటి, టెలివిజన్ హోస్ట్, యాంకర్ సుబీ సురేష్ ఆకస్మిక మరణానికి గురయ్యారు. లివర్ సంబంధింత వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ కోచిలోని ప్రైవేట్ హాస్పిటల్‌లోఈ రోజు బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 41 సంవత్సరాలు. ఆమెకు తల్లిదండ్రులు, ఓ సోదరుడు ఉన్నారు. మలయాళ సినిమా రంగంతోపాటు, బుల్లితెరపై ఆమెకు విశేషంగా అభిమానులు ఉన్నారు. విభిన్న పాత్రలతో, వేదికలపై, ఈవెంట్లలో సమయస్పూర్తితో, తనదైన శైలిలో డైలాగ్స్ చెబుతూ భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకొన్నారు ఈమె. సుబీ సురేష్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవిత విషయాల్లోకి వెళితే..
తొలి నాళ్లలో సుబీ సురేష్ మిమిక్రీ ఆర్టిస్టుగా కొచ్చిన్ కళాభవన్ బృందం ద్వారా కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత తన కెరీర్‌ను రంగస్థలం, బుల్లితెరపైకి తీసుకొచ్చారు. లైవ్ ఈవెంట్స్, టెలివిజన్ షోల ద్వారా అత్యంత ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్నారు ఈమె. సినీ మాలా అనే టీవీ సీరిస్‌లో వివిధ వేషాలతో ఆకట్టుకొన్నారు.
2006లో కనకసింహం అనే చిత్రం ద్వారా మలయాళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు.ఆ తర్వాత అంకుట్టీ, హ్యాపీ హాస్పెండ్స్ అనే చిత్రాలతోపాటు మొత్తం 20 సినిమాలకుపైగా నటించారు. ఇలా ఎంతో మంచి అభిమానులను సంపాదించుకొన్న సుబీ సురేష్ ఆకస్మిక మరణంతో మలయాళ సినిమా పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. ఆమె ప్రతిభను గుర్తు చేసుకొంటూ శ్రద్దాంజలి ఘటించారు. ఓ గొప్ప కళాకారిణి కోల్పోయామంటూ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు.
ఇది కూడా చదవండి :