KL Rahul కేఎల్‌ రాహుల్‌ విధ్వంసం!

KL Rahul కేఎల్‌ రాహుల్‌ విధ్వంసం!

టీ20ల్లో స్లోరన్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేస్తున్నాడంటూ కేఎస్‌ రాహుల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీ20 వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో రాహుల్‌ స్లో బ్యాటింగ్ ఎందుకూ పనికిరాదని క్రికెట్‌ అభిమానులు మండిపడ్డాడు. అందుకు తగ్గట్లే వెస్టర్న్‌ ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ హాఫ్‌ సెంచరీ సాధించినా.. స్లో బ్యాటింగ్‌ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఈ విమర్శలకు చెక్‌ పెట్టాలని భావించాడో ఏమో కానీ.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వామప్‌ మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. ఆసీస్‌ భీకరమైన పేస్‌ ఎటాక్‌ను ఎదుర్కొంటూ ఫోర్లు, సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. కేవలం 27 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 భారీ సిక్సులతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

పెద్ద గ్రౌండ్‌లో కేఎల్‌ రాహుల్‌ కొడుతున్న భారీ సిక్సులు వెళ్లి స్టాండ్స్‌లో పడటం విశేషం. మరో ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే.. టీ20ల్లో పవర్‌ హిట్టింగ్‌తో దూసుకెళ్లున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ను కామ్‌గా ఉంచిన రాహుల్‌.. పవర్‌ ప్లేలో దుమ్మురేపాడు. రోహిత్‌ శర్మ ఖాతా తెరవకముందే.. 49 పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌..

రోహిత్‌ సింగిల్‌తో ఉన్న సమయంలో తన హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 57 పరుగులు చేసి మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. రాహుల్‌ హాఫ్‌ సెంచరీ తర్వాత రోహిత్‌ కూడా గేర్‌ మార్చి.. ఒక సిక్స్‌ ఫోర్‌ బాది టచ్‌లోకి వచ్చాడు. కానీ.. అదే వేగంతో ఆడే క్రమంలో 14 బంతుల్లో ఒక ఫోర్‌, సిక్స్‌తో 15 పరుగులు చేసి అగర్‌ బౌలింగ్‌ మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటైయ్యాడు. ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ 6, సూర్యకుమార్‌ యాదవ్‌ 5 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh