శ్రీలంకతో భారత్ తొలి టీ20లో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన యంగ్ స్టార్.

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. ఈ క్రమంలో ఆటగాళ్లంతా ఏదో ఒకలా ఆకట్టుకున్నారు. అయితే యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మాత్రం బ్యాటుతోనే కాదు.. తన సూపర్ ఫీల్డింగ్‌తో కూడా అందరికీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

బ్యాటింగ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్ వెంట వెంటనే అవుటైనా కూడా.. తను మాత్రం ఇన్నింగ్స్ నిర్మించాడు ఇషాన్ కిషన్.ఆ తర్వాత ఫీల్డింగ్‌లో కూడా చక్కగా రాణించాడు. ముఖ్యంగా శ్రీలంక యంగ్ ట్యాలెంట్ చరిత్ ఆశలంకను అవుట్ చేయడానికి అతను పట్టిన క్యాచ్ చూసి అందరూ షాకయ్యారు. 8వ ఓవర్లో పుల్ షాట్ ఆడే సమయంలో ఆశలంక టైమింగ్ మిస్సయ్యాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతి థర్డ్‌మ్యాన్ దిశగా వెళ్లింది.

కీపింగ్ చేస్తున్న కిషన్ వేగంగా రియాక్ట్ అయ్యి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ క్యాచ్ పట్టేశాడు. అది చూసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా నోరెళ్లబెట్టేశాడు. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు కూడా తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. వెనక్కు పరిగెడుతూ క్యాచ్ పట్టుకోవడం చాలా కష్టమైన పని, అలాంటిది అంత స్టన్నింగ్ క్యాచ్ పట్టేయడంతో బ్యాటర్ కూడా కిషన్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. అయితే దీనిలో పెద్ద చెప్పుకోవాల్సింది ఏమీ లేదని కిషన్ అన్నాడు.బంగ్లాదేశ్ సిరీస్‌లో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, పక్కవారికి వినిపించే అంత గట్టిగా అరవకపోవడం వల్ల కొన్ని క్యాచులు మిస్ అయ్యాయని కిషన్ అన్నాడు.

అది చూసిన తర్వాత దీనిపై కోచ్‌తో కొంత చర్చించినట్లు వెల్లడించాడు. ఆ సమయంలోనే ఇలాంటి క్యాచులను బాగా ప్రాక్టీస్ చేశానని, పక్కవాళ్లకు అర్థమయ్యేలా ఎలా కమ్యూనికేట్ చేయాలో కూడా చర్చించామని వివరించాడు. ప్రాక్టీస్ సమయంలో టెన్నిస్ రాకెట్లు, సాఫ్ట్ బాల్స్‌తో తెగ ప్రాక్టీస్ చేసినట్లు చెప్పిన అతను.. ఆ ప్రాక్టీస్ అంతా ఇప్పుడు ఫలితం చూపించిందని నవ్వేశాడు.అలాగే తను మైదానంలో క్యాచ్ పట్టేందుకు నిర్ణయించుకుంటే నూటికి నూరు శాతం క్యాచ్ కోసం వెళ్తానని కిషన్ అన్నాడు.

‘క్యాచ్ కోసం వెళ్తే నేను ఆలౌట్‌గా వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యా. కన్‌ఫ్యూజన్ ఉండకూడదని గట్టిగా అందరికీ కమ్యూనికేట్ చేశా. ప్రాక్టీస్‌లో కూడా దీనిపై బాగా చర్చించాం’ అని వివరించాడు. అతను అందుకున్న క్యాచ్ గురించి ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ కూడా స్పందించాడు. అది చాలా స్టన్నింగ్ క్యాచ్ అని, అలా వెనక్కు పరిగెడుతూ పట్టుకోవడం చాలా కష్టమని వివరించాడు. తమకు కిషన్ ఎంత వేగంగా పరిగెడతాడో తెలుసునన్న అతను.. అదొక అద్భుతమైన క్యాచ్ అంటూ కిషన్‌కు కితాబిచ్చాడు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh