ఐసీసీ వన్డే ర్యాంకులు.. టాప్ 2లో టీమిండియా స్టార్ క్రికెటర్లు!

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా క్రికెటర్లు మళ్లీ మంచి ప్రదర్శన చూపించారు. శుభ్‌మన్ గిల్ 784 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. ఆయన తర్వాత రోహిత్ శర్మ 756 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. రోహిత్ శర్మ ఐపీఎల్ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోయినప్పటికీ టాప్ 2లో నిలవడం విశేషం.

పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజామ్ 751 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. వెస్టిండీస్ తో జరుగుతున్న సిరీస్‌లో ఆయన బ్యాటింగ్‌లో సరిగ్గా ప్రదర్శన ఇవ్వలేకపోయినప్పటికీ, మూడో స్థానాన్ని కాపాడుకున్నారు. విరాట్ కోహ్లీ 736 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. శ్రేయస్ అయ్యర్ 708 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు, కేఎల్ రాహుల్ 15వ స్థానంలో నిలిచాడు.

వన్డేలలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చివరిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు. ప్రస్తుతం వీరు ఆస్ట్రేలియా పర్యటన కోసం ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిసింది. టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్లు మధ్య మూడు వన్డేల సిరీస్ అక్టోబర్ 19 నుంచి 25 వరకు జరగనుంది. టీ20, టెస్ట్ సిరీస్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌పై మరింత దృష్టి పెట్టారు.

టాప్ ర్యాంకర్స్ లిస్టు:

శుభ్‌మన్ గిల్ – 784 పాయింట్లు

రోహిత్ శర్మ – 756 పాయింట్లు

బాబర్ అజామ్ – 751 పాయింట్లు

విరాట్ కోహ్లీ – 736 పాయింట్లు

డారిల్ మిచెల్ – 720 పాయింట్లు

చరిత్ అసలంక – 719 పాయింట్లు

హ్యారీ టెక్టర్ – 708 పాయింట్లు

శ్రేయస్ అయ్యర్ – 704 పాయింట్లు

ఇబ్రహీం జద్రాన్ – 676 పాయింట్లు

కుశాల్ మెండిస్ – 669 పాయింట్లు

Leave a Reply