నాకు నా భర్తతో గొడవలు లేవు.. సింగర్ కల్పన క్లారిటి..!

సినీ నేపధ్యగాయని కల్పన పేరు తెలియని వారుండరు. ఎన్నో సినిమాల్లో తన గళ మాధూర్యంతో పాటలు పాడి ప్రేక్షకుల హృదయాల్లో ప్రముఖ స్థానం సంపాదించుకున్న కల్పన అనుకోనివిధంగా తన వృత్తి వ్యాపకాలతో స్ట్రెస్ కి గురికావడంతో నిద్రపట్టక ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. అయితే ఎటువంటి అపాయకర పరిస్థితులు లేకుండా కల్పన ప్రస్తుతం కోలుకుంటున్నారు. అయితే తన మీద, తన భర్తమీద పలు మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. దాన్ని వెంటనే ఆపేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఒత్తిడి కారణంగానే నిద్ర పట్టలేదని.. అందుకే నిద్ర మాత్రలు వేసుకున్నానని ఆ వీడియోలో సింగర్ కల్పన చెప్పారు. అయితే అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకోవడం వలన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయానని తెలిపారు. ఈ క్రమంలో నా భర్తపై మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారని.. దయచేసి అసత్యప్రచారం ఆపేయాలని కోరుతూ ఆమె వీడియో విడుదల చేశారు. నేను, నా భర్త, కుమార్తె చాలా సంతోషంగా ఉన్నాం. నా 45 సంవత్సరాల వయసులో నేను పీహెచ్‌డీ తో పాటు, ఎల్‌ఎల్‌బీ చేస్తున్నాను. నా భర్త సహకారం వల్లే ఇవన్నీ చేయగలుగుతున్నా. ఆయనతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. మా కుటుంబం అన్యోన్యంగా ఉంది. కాబట్టి మా జీవితాల గురించి ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెట్టవద్దని కల్పన రిక్వెస్ట్ చేశారు.

ఇక వృత్తిపరంగా తాను చాలా ఒత్తిడిని ఎదుర్కుంటున్నట్టు కల్పన చెప్పారు. దాని వలన నిద్ర పట్టం లేదని.. అందుకు చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. వైద్యులు రికమెండ్ చేసిన ప్రిస్క్రిప్షన్ లో టాబ్లెట్స్ ఓవర్ డోస్ తీసుకున్నాను. అందువల్లే స్పృహ తప్పి పడిపోయాను. అయితే ఆ సమయంలో నా భర్త సరైన రీతిలో స్పందించి కాలనీ వాసులు, పోలీసుల సహాయంతో నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేయటంటో నేను ఇవాళ మీ ముందున్నాను. త్వరలోనే కోలుకుని మిమ్మల్ని నా పాటలతో అలరిస్తానని కల్పన చెప్పుకొచ్చారు.

నా భర్త అందిస్తున్న సహకారం వల్లనే నాకు నచ్చిన రంగంలో రాణించగలుగుతున్నానని చెప్పారు. నా జీవితానికి భగవంతుడిచ్చిన బెస్ట్ గిఫ్ట్ నా భర్త అని సింగర్ కల్పన తెలిపారు. ఇక నా ఆరోగ్యం గురించి వర్రీ అయిన వారందరికీ నా ధన్యవాదాలు అంటూ సింగర్ కల్పనవీడియో రిలీజ్ చేశారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh