Siddaramaiah : రేపు ప్రమాణం చేయనున్న 24
Siddaramaiah : ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
మే 20వ తేదీన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టారు.
అదే రోజు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
వీరితో పాటు కనీసం మరో 25 మంది మంత్రులు కావాల్సి ఉంది.
దీంతో మే 19న కేబినెట్ కూర్పుపై కసరత్తు ప్రారంభమైనా.
. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య విబేధాల కారణంగా ఏకాభిప్రాయం కుదరలేదు.
దీంతో మంత్రి పదవుల పంచాయతీ కాంగ్రెస్ హైకమాండ్ వద్దకు చేరింది.
సిద్ధరామయ్య క్యాబినెట్లోకి మరో 24 మందిని తీసుకురానున్నారని, శనివారం
ప్రమాణస్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో మకాం వేసిన
సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. కేంద్ర పెద్దలతో సమావేశమైన అనంతరం
తుది జాబితాను Siddaramaiah : ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
ఇదే అంశంపై రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య నేడు భేటీ కానున్నట్టు సమాచారం.
కానీ రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత కీలకమైన వర్గమైన లింగాయత్‌లు కాంగ్రెస్
గెలుపునకు పెద్దపీట వేసినట్లు పేర్కొంటూ ముఖ్యమంత్రి పదవిని ఆశించారు.
లింగాయత్ ముఖ్యమంత్రి లేకపోవడంతో ఆ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు
దక్కుతాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా,
త్వరితగతిన ఫలితాలు చూపించి, ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని కాంగ్రెస్ కూడా
ఒత్తిడిలో ఉంది. కర్ణాటకలో మొత్తం 28 ఎంపీ స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో నిరాశాజనక ఫలితాలు వచ్చాయి.
దీంతో ఈసారి ఎలాగైనా మెజార్టీ సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది.
అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించింది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాటి కాంగ్రెస్ భారీ మెజార్టీ సాధించడం విశేషం.
అటు జేడీఎస్ 23 సీట్ల రాగా 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో అధికారానికి
కావల్సిన మేజిక్ ఫిగర్ 113. అయితే కాంగ్రెస్ Siddaramaiah : పార్టీ 136 స్థానాల్లో స్పష్టమైన మెజార్టీ సాధించింది.