Roja: రోజాకు బిగ్ షాక్ ఆడుదాం ఆంధ్రాపై ఏసీబీకి గ్రీన్ సిగ్నల్..!

వైసీపీ నేత, మాజీ మంత్రి రోజాకు బిగ్ షాక్ తగిలింది. వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా పేరుతో భారీ ఎత్తున అవినితీ జరిగిందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. అప్పట్లో వైసీపీ మంత్రి రోజా వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా పేరుతో నిర్వహించిన పోటీల్లో భారీ ఎత్తున అవినితీ జరిగిందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది.

ముఖ్యంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి ఆర్ కే రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఒకేసారి షాక్ ఇచ్చేలా ప్రభుత్వం పావులు కదుపుతోందని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అవినీతి చోటుచేసుకుందనే ఫిర్యాదులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో రోజా, బైరెడ్డికి ఉచ్చు బిగిసినట్లేనని టాక్ వినిపిస్తోంది. ఏపీలో ఎన్నికలకు ముందు వైసీపీ ఆడుదాం ఆంధ్రా పేరుతో పోటీలు నిర్వహించింది. అయితే ప్రభుత్వం కేటాయించినవే కాకుండా జిల్లాలోని నిధులు కూడా వినియోగించినట్లు పలువురు సభ్యులు ఆరోపణలు చేశారు. ఇందులో భారీ అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఏసీబీ విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

వైసీపీ ప్రభుత్వ హయాంలో క్రీడాశాఖ మంత్రిగా రోజా ఉన్నారు. ఈ క్రమంలో త్వరలో రోజా అరెస్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అటు ఆడుదాం ఆంధ్రాపై నిన్న ఏపీ అసెంబ్లీలో చర్చ కూడా నడిచింది. క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ… 47 రోజుల్లో రూ.120 కోట్లు మంచినీళ్లలా ఖర్చు పెట్టారని కీలక కామెంట్స్ చేశారు. దీనిపై మాట్లాడాలంటే తనకే సిగ్గుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు గోల్ మాల్ అయ్యాయని కూటమి ఎమ్మెల్యేలు చర్చ సందర్భంగా ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూ.120 కోట్ల రూపాయలతో ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం కోసం కొనుగోలు చేసిన కిట్లు, ఇతర వస్తువులకు అధిక ధర చెల్లించి ప్రజాధనాన్ని దారి మళ్లించారని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు వ్యక్తి ఆడుదాం ఆంధ్రా అవినీతిలో మాజీ మంత్రి రోజాకు భాగం ఉందంటూ ఫిర్యాదు చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సైతం ఎప్పటికప్పుడు గత ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకుంటామని ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అవినీతిపై వచ్చిన ఫిర్యాదులను విచారించేందుకు ప్రత్యేక కమిటీని నియమించినట్లు చెబుతున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh