Revanth reddy :పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Revanth reddy :లా పార్టీలు మారడం తనకు చేతకాదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచడం నావల్ల కాదు.
. రేవంత్ రెడ్డి పార్టీని ఎలా నడుపుతున్నారో జగ్గారెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అడిగితే తెలుస్తుందన్నారు.
హుజూరాబాద్ , దుబ్బాక, జీహెచ్ఎంసీ , ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘పార్టీ నడపరాకుంటే ఎలా గెలుస్తాం.
మేము గెలుపు పరంపరం కొనసాగిస్తున్నాం.. వారు ఓటమి పరంపర సాగిస్తున్నారు.
డిపాజిట్లు కోల్పోయిన పరంపర సాగుతోంది. ముసుగులు వేసుకుని తిరిగే పార్టీ మాది కాదు.
ఓవైసీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనలేదు. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలి.
ఎంఐఎం పార్టీని నిజమైన తెలంగాణ ముస్లింలు వ్యతిరేకించాలి” అని బండి సంజయ్ అన్నారు.
బీజేపీ లో సీనియర్ లే బాస్ లు , కాంగ్రెస్ లో వారు హోంగార్డులని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉనికే లేదని నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు.
బీజేపీ ఎక్కడుందో కేటీఆర్ తన తండ్రిని అడగాలని సూచించారు.తమది కుటుంబ పార్టీ కాదన్నారు.
”తెలంగాణ ఆవిర్భావంలో జెండా ఎగురవేయనోడికి తెలంగాణలో పోటీ చేసే అర్హత లేదు.
జెండా ఎగురవేయనందుకు కేసీఆర్కు దమ్ముంటే దారుస్సలాంకు తాళం వేయాలి.
17 సెప్టెంబర్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాం. తెలంగాణ ఆవిర్భవాన్ని కూడా అధికారికంగా నిర్వహించాం.
క్రెడిట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదే.. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిర్వహించేలా చేశారు” అని బండి సంజయ్ పేర్కొన్నారు.