Revanth: కోమటిరెడ్డి ఇంటికి వెళ్లి కలసిన రేవంత్
Revanth: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, ముఖ్యంగా పొంగులాటి, జూపల్లి చేరికలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం.
అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఐక్యంగా కృషి చేస్తామని అన్నారు.
కోమటిరెడ్డికి, జానా రెడ్డికి సమాచారం ఇవ్వకుండా వారి నియోజకవర్గాలకు చెందిన వారెవరూ కాంగ్రెస్‌లో చేరబోరని రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో కనీసం 15 ఎంపీ స్థానాల్లోనైనా గెలిచి రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 30 ఎంపీ సీట్లు సాధించి కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి రావడానికి అప్పటి Revanth: ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు.
ఈ ముగ్గురు సమావేశంలో చర్చించుకున్న అంశాలపై ఢిల్లీ అధిష్ఠానికి నివేదిక సమర్పించబోతున్నారు రేవంత్.
పొంగులేటి, జూపల్లితోపాటు మరికొందరు చేరికపై కూడా చర్చించనున్నారు.
రాహుల్‌తో గురువారం రేవంత్ సమావేశమవుతారని… తెలంగాణలో పర్యటనపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.
ఈ నెలాఖరుకల్లా చేరికలపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఇది ఆలస్యమైతే రాహుల్ గాంధీతో తో పొంగులేటి బ్యాచ్ కలిసే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది.
ఆ భేటీ తర్వాత అధికారక ప్రకటన రావచ్చని టాక్ నడుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త జోష్ వచ్చింది. డీకే శివకుమార్- సిద్ధరామయ్యల స్ఫూర్తితో సీనియర్ లీడర్లు అంతా కలిసి పని చేస్తున్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అలా లీడర్లు అంతా కలిసి పాల్గొంటున్నారు.
ఆపరేషన్ కమలం పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఆపరేషన్ హస్తం స్పీడ్ అందుకుంది. పొంగులేటి, జూపల్లి కృష్ణారావులు పార్టీలో చేరేలా మంతనాలు పూర్తి చేశారు.
వీరితో పాటు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గుర్నాథ్ రెడ్డి సైతం Revanth: హస్తం పార్టీకి టచ్‌లోకి వచ్చారు.
తాండురు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో విభేదాలు ఉన్న పట్నం మహేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఇలా బీఆర్ఎస్ కు ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుందనే సంకేతం.. ఇతర పార్టీల్లోని నాయకులకు పంపిస్తోంది తెలంగాణ కాంగ్రెస్.