మరో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా గోడౌన్ లు, హెడ్ ఆఫీసులాంటి ప్రదేశాల్లో ప్రమాదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అగ్నిప్రమాదాల కారణంగా కోట్లాది రూపాయల ఆస్తి నష్టంతో పాటు పలుచోట్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరహా ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు మళ్లి హైదరాబాద్ లోని రామంతపూర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ గోదాంలో శనివారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటల్లో గోడౌన్లోని విలువైన ఫర్నిచర్, సామాగ్రి పూర్తిగా దగ్ధమైనట్టుగా సమాచారం. ఘటన లో మంటలు భారీగా ఎగిసి పడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు.
అయితే భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడ మంటలు భారీగా ఎగిసి పడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్మేసింది. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదంతో సంభవించిన ఆస్తినష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి గోడౌన్లపై విస్తృత తనిఖీలు నిర్వహించాలని, ఆయా గోడౌన్ల అనుమతులను పరిశీలించాలని కోరుతున్నారు. సరైన ఫైర్ సెఫ్టీ నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా నిర్ధారించుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: