Prabhas:భారీ ధర పలికిన ‘ఆదిపురుష్’ తెలుగు థియేట్రికల్ రైట్స్
Prabhas: బాలీవుడ్ ఏస్ ఫిలిం మేకర్ ఓం రౌత్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన
చిత్రం ‘ఆదిపురుష్’ భారతీయ ఇతిహాస గాథ ‘రామాయణం’ ఆధారంగా భారీ బడ్జెట్‌తో రూపొందిన
ఈ చిత్రాన్ని టీ-సిరీస్ సంస్థ నిర్మించింది. ఇక బాహుబలి స్టార్ ప్రభాస్ కృతి సనన్ సీతారాములుగా
నటించిన చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ రావణ బ్రహ్మగా కనిపించనున్నాడు. జూన్ 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు
రానుండగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఇదిలా ఉంటే ‘ఆదిపురుష్’ థియేట్రికల్ రైట్స్ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం.
ఆదిపురుష్’ తెలుగు వెర్షన్ హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో
న్యూస్ వైరల్ అయ్యింది. ఇందుకోసం ఏకంగా రూ.170 కోట్లు వెచ్చించినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగులో ఇప్పటి వరకు
ఇదే అత్యధికమని తెలుస్తోంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా సంస్థనే ‘ఆదిపురుష్’ చిత్రాన్ని విడుదల Prabhas: చేయనుంది.
కాగా ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రాజా డీలక్స్’ చిత్రాన్ని ఇదే సంస్థ నిర్మిస్తున్నట్లు టాక్.
ఈ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రభాస్‌తో ఇప్పుడు ఏకంగా మూడు ప్రాజెక్ట్‌లు డీల్ చేస్తోంది.
ఇవేగాక తెలుగులో పలు క్రేజీ మూవీస్‌ను కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ‘రాజా డీలక్స్’ షూటింగ్ జరుగుతోందని, త్వరలోనే పూర్తి చేయాలన్నారు. ప్రభాస్ తాతను వెంటాడుతున్న
రాజా డీలక్స్ అనే థియేటర్ చుట్టూ తిరిగే హారర్ కామెడీగా ఈ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.
అయితే ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. భారత్ లో విడుదల కానున్న ఈ చిత్రం జూన్ 13న న్యూయార్క్
లో జూన్ 7 నుంచి 18 వరకు జరిగే Prabhas: ట్రిబెకా ఫెస్టివల్ లో వరల్డ్ ప్రీమియర్ ను ప్రదర్శించనుంది.
2001 లో రాబర్ట్ డి నీరో, జేన్ రోసెంతల్ మరియు క్రెయిగ్ హట్కోఫ్ స్థాపించిన ఓకెఎక్స్ సమర్పించిన ట్రిబెకా
ఫెస్టివల్, కళాకారులు మరియు వైవిధ్యమైన ప్రేక్షకులను దాని అన్ని రూపాల్లో కథలను జరుపుకోవడానికి
ఏకతాటిపైకి తీసుకువస్తుంది. అలాగే 2023 జూన్ 16న ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.