YCP Vs TDP: వైసీపీ తమ తప్పు సరిదిద్దుకోవాలి – చంద్రబాబు
YCP Vs TDP: వైసీపీ నేతలు రజనీకాంత్‌పై విమర్శలు చేసినందున ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మరియు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. వైసీసీ నేతలు సినీ హీరో రజనీకాంత్ పైన చేస్తున్న విమర్శలను టీడీపీ అధినేత చంద్రబాబు తప్పు బట్టారు. రజనీకాంత్ విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నపుడు చంద్రబాబు విజన్ పైన ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు విజన్ ఏపీకి మేలు చేస్తుందని ఆ సందర్భంగా చెప్పుకొచ్చారు.
ఆ కామెంట్స్ పై వైసీపీ నేతలు రజిని పై ఫైర్ అయ్యారు. ఆ ప్రసంగంపై ఏపీలోని అధికార వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది. పలువురు ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు రజనీకాంత్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వైసీపీ మద్దతుదారులు రజనీకాంత్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.
అయితే ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ట్విటర్ ద్వారా వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ ను ఖండించారు. అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని…అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ @rajinikanth గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు…ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి….జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి అంటూ చంద్రబాబు గారు ట్విటర్ ద్వారా వైసీపీ నేతలను డిమాండ్ చేశారు.