త్వరలో రానున్న వందే మెట్రో ట్రైన్

త్వరలో రానున్న వందే మెట్రో ట్రైన్

2023-24 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వేతన జీవులకు ఊరటనివ్వడంతోపాటురైతులు, నిరుద్యోగులకు, పారిశ్రామికరంగాలకు కేంద్రం అధిక కేటాయింపులు జరిపింది. కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం.ఇండియన్ రైల్వేకు భారీగా కేటాయింపులు చేసింది. గతంలోఎపుడు  లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.2.41 లక్షల కోట్లను కేటాయించింది. 2013-14 సంవత్సరంతో పోలిస్తే ఈ రైల్వే బడ్జెట్ దాదాపు 9 రెట్లు ఎక్కువ అనే చెప్పాలి.  బడ్జెట్లో అతిపెద్ద కేటాయింపు కూడా ఇదే కావడంతో ప్రాధాన్యం ఏర్పరుచుకుంది.  రైల్వేకు అధిక కేటాయింపుల అనంతరం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. పెద్ద నగరాలకు సమీప ప్రాంతాలకు వేగంగా రాకపోకలు జరిపేందుకు వీలుగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మినీ వెర్షన్ ‘వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టబోతున్నట్లు రైల్వే మంత్రి వైష్ణవ్  ప్రకటించారు. సామాన్యులు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, పర్యాటకులకు వెసులుబాటుగా, అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. వందే భారత్‌ తరహాలోనే ‘వందే మెట్రో’లను కూడా అభివృద్ధి చేస్తున్నామని, డిజైన్, ఉత్పత్తి ఈ ఏడాదే ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్‌ను సమర్పించిన తర్వాత, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వేకు చేసిన కేటాయింపులపై స్పందించారు. ఈ బడ్జెట్‌ను రైల్వే ఎలా ఉపయోగించుకోనుంది, తదితర విషయాల గురించి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రైల్వే అభివృద్ధి.. ప్రజా రవాణా మెరుగుపర్చేందుకే ఈ కేటాయింపులు జరిగినట్లు తెలిపారు. 1,275 స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేస్తున్నామని, వందే భారత్ రైళ్ల ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని అశ్విని వైష్ణవ్ చెప్పారు.

రైల్వేలకు రూ .2.41 లక్షల కోట్లు కేటాయించారని ఇది కీలక మార్పు.. ప్రయాణీకుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని తెలిపారు. ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద, 1,275 స్టేషన్లను తిరిగి అభివృద్ధి చేస్తున్నామన్నారు. వందేభారత్ రైళ్లను మరిన్ని ప్రారంభిస్తామని తెలిపారు. వందేభారత్ రైళ్లు ఇప్పుడు హర్యానాలోని సోనిపట్, మహారాష్ట్రలోని లాతూర్‌లో కూడా తయారవుతాయని ఆయన తెలిపారు.

“ఇప్పుడు ఐసిఎఫ్ చెన్నైతో పాటు, హర్యానాలోని సోనిపట్, మహారాష్ట్రలోని లాతూర్‌లలో వందే భారత్ రైళ్లు తయారవుతాయి. ప్రతి మూలను వందేభారత్ రైళ్లతో అనుసంధానించాలనే మన ప్రధాని మోడీ కలను ఇది నెరవేరుస్తుంది” అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో హైడ్రోజన్‌తో నడిచే ప్యాసింజర్ రైళ్లు అందుబాటులోకి వస్తాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ఈ సంవత్సరం “డిసెంబర్ 2023 నాటికి హైడ్రోజన్ రైలు వస్తుంది.అని  భారతదేశంలో తయారు అవుతుంది. మొదట, ఇది కల్కా-సిమ్లా వంటి హెరిటేజ్ సర్క్యూట్‌లలో నడుస్తుంది. తరువాత ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాం.. ”అని అశ్విని వైష్ణవ్ చెప్పారు.

 

ఇది కూడా చదవండి: 

 

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh