టీఎస్ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

telangana eamset schedule release

టీఎస్ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్  విడుదలయ్యింది. ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్ లింబాద్రి తెలిపారు.  మార్చి 3 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది.  ఆన్ లైన్ లో అప్లికేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 4. లేట్ ఫీజుతో మే 2వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు

మే 7,8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు జరగనున్నాయి. మే 10, 11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుండి 12 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 నుండి 6 వరకు రెండవ సెషన్ పరీక్ష పరీక్ష ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 500 రూపాయలుగాఇతర విద్యార్థుల,కు ఎంసెట్ ఫీజు 900 రూపాయలుగా ఫిక్స్ చేశారు.

ఇది కూడా చదవండి :

Leave a Reply