YSR Telangana: జైలుకు వైఎస్ విజయమ్మ

YSR Telangana

YSR Telangana: జైలుకు వైఎస్ విజయమ్మ

YSR Telangana: పోలీస్ ల పై  దాడిలో  అరెస్ట్  అయ్యి రిమాండ్ లో వున్నా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను ఆమె తల్లి విజయమ్మ చంచల్ గూడ జైల్లో కలిశారు.  మహిళా జైల్లో  వైఎస్ షర్మిలను పరామర్శించనున్నారు. ఓ ఎస్సై, కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.  ఈ క్రమంలో షర్మిలను పరామర్శించేందుకు విజయమ్మ జైలుకు వచ్చారు.

జైల్లో వైఎస్ షర్మిలను విజయమ్మ కలుసుకుని మాట్లాడనున్నారు. ఈ కేసులో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై షర్మిలతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంచల్‌గూడ జైలు దగ్గరకు YSR Telangana శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. షర్మిల అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు వైఎస్సార్‌టీపీ వర్గాలు పిలుపునిచ్చాయి. అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని నిర్ణయించారు. దీంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో వైఎస్సార్‌టీపీ నేతల కదలికలపై నిఘా పెట్టారు.

నిన్న(సోమవారం) ఉదయం షర్మిల సిట్ ఆఫీస్ కు వెళ్లబోతుందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను ముందస్తు అరెస్ట్ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేస్తుండగా ప్రతిఘటించారు. “నన్నెందుకు అడ్డుకుంటున్నారు. నా సొంత పనులపై బయటకు వెళ్లకూడదా?” అని పోలీసులను ప్రశ్నించారు. ఇక ఆమెను పట్టుకున్న ఓ మహిళా కానిస్టేబుల్ చెంపపై షర్మిల కొట్టారు. అంతేకాదు ఓ ఎస్సై పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించారు. అలాగే మరో కానిస్టేబుల్ కాలుపై నుంచి షర్మిల కారు పోనీయడంతో గాయాలయ్యాయి  ఈ ఘటనలో కానిస్టేబుల్ గిరిబాబు కాలుకు తీవ్ర గాయమైంది. వీధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడినందుకు కేసు నమోదు చేసి బంజార హిల్స్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అనంతరం ఆమెను గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టు ముందు హాజరుపర్చారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగింది. నాంపల్లి కోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత షర్మిలకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మే 8వ వరకు షర్మిల రిమాండ్‌లో ఉండనున్నారు. ఈ క్రమంలోషర్మిలకు  బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.

Leave a Reply