Telangana: ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

Telangana

Telangana: ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

Telangana: పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

అక్కడి ప్రజల నైపుణ్యాలను, సంస్కృతి గొప్పతనాన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారని ట్వీట్ చేశారు.

దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమం తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది.

”Telangana: ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అద్భుతమైన రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు.

అక్కడి ప్రజల నైపుణ్యాలు, అక్కడి సంస్కృతి గొప్పతనాన్ని ఎంతగానో మెచ్చుకుంటారు.

తెలంగాణ శ్రేయస్సు, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని చెప్పారు.

అలాగే ప్రధాని మోదీ చేసిన ఈ ట్వీట్‌ను పలువురు రీట్విట్ చేస్తున్నారు.

తెలంగాణ ప్రజల తరపున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు, వేలాది మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్నది తెలంగాణ రాష్ట్రమన్నారు.

అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, అభివృద్ధి పథంలో దూసుకెళ్ళాలని జనసేనపార్టీ తరపున ఆకాంక్షించారు.

ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు.

అలాగే రాష్ట్ర ఆవిర్బావ వేడుకలు నేటి నుంచి జూన్ 22 వరకు మెుత్తం 21 రోజుల పాటు రోజుకో ప్రత్యేక కార్యక్రమం చొప్పు రాష్ట్ర ఆవిర్బావ వేడుకలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

పల్లె నుంచి పట్నం దాకా  వాడవాడలా రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

Leave a Reply