డెక్కన్‌మాల్‌ భవనం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్

deccan mall fire decision to demolish the building, deccan mall News, TS News, Fire Accident, Hyderabad police registered case Deccan Mall

గురువారం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌ రామ్‌గోపాల్‌పేటలోని డెక్కన్‌ నైట్‌వేర్‌ స్పోర్ట్స్‌ షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. నిన్నటి నుండి 30 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండగా, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చిన భవనంలో కొన్ని ప్రదేశాలలో ఇంక మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. కాగా వసీం, జునైద్‌, బహీర్‌ అనే వ్యక్తులు మిస్సయినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు పోలీసులు. బావనం చుట్టు దట్టమైన పొగ, ఎగిసిపడుతున్న మంటల వల్ల ఆ ముగ్గురిని గుర్తించలేకపోతున్నామని పోలీసులు ఒక సందర్భంలో పేర్కొన్నారు.  ఈ భవనం ఇంతలా ప్రమాదానికి గురి కావడం కారణం నిబంధనలకు విరుద్దంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో ఆ భావన యజమాని మహ్మద్‌, రహీంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దాంతో డెక్కన్‌మాల్‌ను కూల్చివేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

 

ఇవి కూడా చదవండి:  

Leave a Reply