Hindi Controversy: పవన్ కళ్యాణ్ హిందీ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ సెటైర్లు – Xలో ఫైర్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న జనసేన సభలో హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి బహుభాషా విధానం అవసరం అని, తమిళనాడు సహా అన్నీ రాష్ట్రాలు ఒకే విధానం పాటించాలని పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందిస్తూ సెటైర్లు వేశారు.

ప్రకాశ్ రాజ్ X (Twitter) లో ‘‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం, ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడమే. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి’’ అంటూ ట్వీట్ చేశారు. తాను తరచుగా ఉపయోగించే #JustAsking హ్యాష్‌ట్యాగ్‌తో పవన్‌పై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడుతూ హిందీ వ్యతిరేకత అన్యాయమని అన్నారు. తమిళనాడు ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు వేశారు. ‘‘హిందీ భాషను అంగీకరించలేకపోతే, తమిళ సినిమాలు హిందీలో డబ్బింగ్ ఎందుకు చేస్తున్నారు? రూపీ సింబల్ తమిళంలోకి మార్చుకోవడాన్ని ఏ రాష్ట్రం అనుసరిస్తోంది?’’ అంటూ వ్యాఖ్యానించారు.

ప్రకాశ్ రాజ్ ఇది మొదటిసారి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం కాదు. గతంలో తిరుపతి లడ్డూ వివాదం, సనాతన ధర్మం వంటి వివాదాలపైనా #JustAsking అంటూ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ త్రీ లాంగ్వేజ్ పాలసీ ను సమర్థించడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది.

ఇక, కేంద్రం త్రీ లాంగ్వేజ్ పాలసీని అమలు చేయాలని భావిస్తోంది. అయితే, తమిళనాడు అధికార పార్టీ DMK దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ – ప్రకాశ్ రాజ్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం మొదలైంది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ప్రజలలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

Leave a Reply