Odisha : జూన్ 29 వరకు ఒడిశాలో భారీ వర్షాలు ఐఎండీ

Odisha : జూన్ 29 వరకు ఒడిశాలో భారీ వర్షాలు ఐఎండీ

Odisha ఈ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

నిన్న ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర ఇంటీరియర్ ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ జార్ఖండ్ మీదుగా ఉందని భువనేశ్వర్లోని వాతావరణ కేంద్రం సోమవారం ఒక వాతావరణ బులెటిన్ లో  తెలిపింది.

అల్పపీడనం కారణంగా  రాగల మూడు  రోజుల్లో ఉత్తర మధ్యప్రదేశ్ వైపు కదిలే అవకాశం ఉంది. రానున్న కొద్ది రోజుల్లో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు కూడా వాతావరణ కేంద్రం జారీ చేసింది.

వాతావరణ సూచన మరియు హెచ్చరికలు 

మొదటి రోజు: (27.06.23 ఉదయం 8.30 గంటల వరకు ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంటుంది )

ఆరెంజ్ అలర్ట్: ఝార్సుగూడ, బార్గఢ్, సుందర్గఢ్, సంబల్పూర్ జిల్లాల్లో కొన్ని చోట్ల, నువాపాడా, బోలంగీర్, బౌధ్, సోనేపూర్, అంగుల్, దేవ్గఢ్, కియోంఝర్ జిల్లాల్లో ఒకటి లేదా రెండు

చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు (7 నుంచి 20 సెంటీమీటర్లు) కురిసే అవకాశం ఉంది.

రెండవ రోజు : (27.06.23 ఉదయం 8.30 గంటల నుంచి 28.06.23 ఉదయం 8.30 గంటల ఎల్లో అలర్ట్ అమలులో ఉంటుంది)

ఎల్లో అలర్ట్: కియోంఝర్, నువాపడా, బోలంగీర్, బార్గఢ్, సోనేపూర్, సంబల్పూర్, ఝార్సుగూడ, సుందర్గఢ్, దేవ్గఢ్, మయూర్భంజ్,

బాలాసోర్ జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మూడో రోజు: (28.06.23 ఉదయం 8.30 గంటల నుంచి 29.06.23 ఉదయం 8.30 గంటల వరకు ఎల్లో అలర్ట్ అమలులో ఉంటుంద )

ఎల్లో అలర్ట్: కియోంఝర్, సుందర్గఢ్, మయూర్భంజ్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Leave a Reply