LB Nagar: ఎల్బీ నగర్‌లో కుప్పకూలిన ఫ్లై ఓవర్ స్లాబ్ …

LB Nagar

LB Nagar: ఎల్బీ నగర్‌లో కుప్పకూలిన ఫ్లై ఓవర్ స్లాబ్ …

LB Nagar :  హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్డులో ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా వరకూ నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ వద్ద పిల్లర్.. పిల్లర్‌కు మధ్య ఉన్న స్లాబ్ కుప్పకూలింది.ప్రమాద సమయంలో స్లాబ్ పై పది మంది కార్మికులు పనులు చేస్తున్నారు. వారిలో ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది.

క్షతగాత్రులను స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారు. ఇక్కడ పనిచేస్తున్న  కార్మికులు బీహార్, యూపీకి చెందిన వారిగా గుర్తించారు. ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు.సాగర్ రింగ్ రోడ్‌లో నిర్మాణంలో ఉన్న LB Nagar ఫ్లై ఓవర్ స్లాబ్  ర్యాంప్ కూలిన విషయంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజం మాట్లాడుతూ రాత్రి మూడు గంటల సమయంలో ర్యాంప్ కూలడం జరిగిందని చెప్పారు.

అయితే ఫ్లైఓవర్‌ అర్ధరాత్రి కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పిదని, అదే ప్రమాదం పగలు సమయంలో ప్రమాదం జరిగి ఉంటే తీవ్ర ప్రమాదంగా మారి ఉండేది అని అధికారులు తెలిపారు.కాగా ఈ ప్రమాదంలో గాయపడ్డవారు యూపీ, బీహార్ కు చెందిన నిర్మాణ కార్మికులు ఎక్కువ మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాంక్రీట్ మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలాన్ని ప‌రిశీలించిన‌ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఫ్లైఓవర్ కూలిపోయిన ఘటనపై ఉన్నతాధికారులతో దర్యాప్తు చేపిస్తామని, దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షపడేలా చేస్తామన్నారు.ఇక ఘటనా స్థాలానికి ఇంజినీర్ల బృందం చేరుకోనుంది. Fly Over :  కూలి పోవడానికి గల కారణాలను ఏంటనే దానిపై ఇంజినీర్ల బృందం పరిశీలన చేపట్టనుంది.

నేడు ఇంజినీర్ల బృందం ఘటనా స్థలానికి చేరుకునే అవకాశముంది. నాణ్యత లేకుండా నిర్మించడమే కారణమా..? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనేది ఇంజినీరింగ్ నిపుణుల టీమ్ తేల్చనుంది.ఈ ఘటనతో స్థానికులు అర్థరాత్రి ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.అలాగే  గాయపడిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించనున్నట్లు తెలిసిన సమాచారం.

 

Leave a Reply