Kerala Visit: ప్రధాని మోదీ భద్రతా వివరాలు లీక్

Kerala Visit

కేరళ పర్యటనకు ముందే ప్రధాని మోదీ భద్రతా వివరాలు లీక్

Kerala Visit: ప్రధాని మోదీ సోమవారం (ఏప్రిల్ 24,2023)న కేరళలోని కొచ్చిలో పర్యటించనున్నారు.  తిరువనంతపురం, కొచ్చిలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.  రోడ్ షోలో కూడా పాల్గొననున్నారు  దీని కోసం కేరళ పోలీసులు మోదీ భద్రత విషయం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సోమవారం కొచ్చి చేరుకుని రోడ్ షోలో పాల్గొంటారు. మంగళవారం 25న వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.

అయితే ప్రధాని మోదీ Kerala Visit సందర్భంగా ఆయనపై ఆత్మాహుతి బాంబు దాడి జరుగుతుందని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కే సురేంద్రన్‌కు గత వారం ఒక బెదిరింపు లేఖ అందింది. కొచ్చికి చెందిన వ్యక్తి పేరుతో మలయాళంలో రాసి ఉన్న ఆ లెటర్‌ను పోలీసులకు ఆయన అందజేశారు.  అయితే ఈ బెదిరింపు లేఖ గురించి తనకు ఏమీ తెలియదని అతడు చెప్పాడు. లేఖలో ఉన్న చేతి రాతను తన రాతలో పోలీసులు సరి చూసుకున్నట్లు మీడియాతో అన్నాడు. స్థానిక చర్చికి సంబంధించిన అంశంలో అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో తమకు విభేదాలు ఉన్నట్లు జానీ కుటుంబం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ బెదిరింపు లేఖ వెనుక ఆ వ్యక్తి ప్రమేయం ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారు.

అయితే  ప్రధాని నరేంద్ర మోడీ Kerala Visit కు కొన్ని రోజుల ముందు ఆయన భద్రతా ఏర్పాట్ల వివరాలు మీడియాకు లీక్ అయ్యాయని ఈ విషయంలో వామపక్ష ప్రభుత్వం మౌనంగా ఉందని కేంద్ర సహాయ మంత్రి వి.మురళీధరన్ ఆరోపించారు. విధి నిర్వహణలో ఉన్న అధికారుల పేర్లు వారి పాత్ర ప్రధానికి సంబంధించిన సవివరమైన ప్రోగ్రామ్ చార్ట్ వివరాలతో కూడిన 49 పేజీల నివేదికను ఇటీవల ఏడీజీపీ (ఇంటెలిజెన్స్) మలయాళ మీడియాలో ప్రసారం చేయగా  ఈ లీకేజీ కేరళ పోలీసుల ఘోర తప్పిదమని బీజేపీ ఆరోపించింది.

Kerala Visit లో ప్రధాని కోసం ఏర్పాటు చేయాలనుకున్న భద్రతా ఏర్పాట్ల వివరాలు మీడియా, వాట్సప్ గ్రూపుల్లో లీక్ కావడం ఆశ్చర్యంగా ఉందని మురళీధరన్ అన్నారు. కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేరళ ప్రభుత్వం మౌనం పాటిస్తోంది. 24 గంటల్లో బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు కొన్ని రోజుల ముందు లీకేజీ ఆరోపణలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను బీజేపీ  వివరణ కోరింది. రాష్ట్రంలో భద్రతను మరింతగా కట్టుదిట్టం చేశారు. ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు మీడియాకు లీక్‌ అవడం కూడా వివాదాస్పదమైంది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేరళ పోలీసుల వైఫల్యం అని మండిపడ్డారు.

Leave a Reply