Karnataka: శిక్షణ విమానం అత్యవసర ల్యాండింగ్

Karnataka

Karnataka: శిక్షణ విమానం అత్యవసర ల్యాండింగ్

Karnataka: సాంకేతిక లోపం కారణంగా భారత శిక్షణ విమానం కర్ణాటక లోని బెలగావి వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఈ విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఎయిర్‌ఫోర్స్ ఆస్పత్రికి తరలించారు. శిక్షణ విమానం పైలట్, ట్రైనీ పైలట్‌తో కలిసి మంగళవారం ఉదయం 9.30 గంటలకు బెలగావి లోని సాంబ్రా విమానాశ్రయం నుంచి బయలు దేరింది.

మధ్యలో సాంకేతిక లోపం తలెత్తడంతో బెలగావి లోని హోన్నిహాల గ్రామం వద్ద పొలంలో దిగింది. ఈ సమాచారం తెలిసి ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది, శిక్షణ పాఠశాల అధికారులు , అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. బెళగావిలోని ఫ్లైట్ ట్రైనింగ్  సెంటర్ శిక్షకులకు ఇది శిక్షణ విమానం కావడం గమనార్హం. పైలట్ నియంత్రిత వేగంతో విమానాన్ని ల్యాండ్ చేయడంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన విమానాన్ని రక్షించేందుకు అధికారులతో పాటు రైతులు, ఇతర స్థానికులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) 2023 మార్చి 29న బెళగావి విమానాశ్రయంలో రెడ్బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీని ప్రారంభించారు.రెడ్ బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ అనేది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) – ఆమోదించిన ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్, ఇది 2017 లో స్థాపించబడింది.

Leave a Reply