Hyderabad: రెహ్మత్ నగర్ లో విషాదం..గోడకూలి చిన్నారి మృతి

Hyderabad

Hyderabad: రెహ్మత్ నగర్ లో విషాదం..గోడకూలి చిన్నారి మృతి

Hyderabad: భాగ్యనగరాన్ని అకాల వర్షం ముంచెత్తింది. ఈదురు గాలులు, ఉరుమెలు మెరుపులతో మంగళవారం సాయంత్రం మొదలైన వాన రాత్రంతా కురుస్తూనే ఉంది. తెల్లవారుజాము వరకు కుండపోతగా కురిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోని ఇండ్లలోకి నీరుచేరింది. పలుచోట్ల రోడ్లపైకి నీరుచేరడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే వరద నీరు నిలిచినచోట జీహెచ్‌ఎంసీ బృందాలు రంగంలోకి దిగాయి. నీటిని డ్రైనేజీల్లోకి వెళ్లేలా చర్యలు  తీసుకున్నారు.

బోరబండా సమీపంలోని రెహ్మత్ నగర్  ఓ ఇంట్లో విషాదం చోటు చేసు కుంది.  వర్షాల కారణంగా ప్రక్కనే వున్నా నాలుగో అంతస్తు గోడకూలి  దానికి సమీపన వున్నా రేకుల షెడ్డు  పై పడి బెడ్ పై నిద్రిస్తున్న  8 నెలల జీవనికా మీద  గోడ పడడంతో  జీవనిక   అక్కడికక్కడే  మృతి చెందింది.దంపతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

నారాయణఖేడ్ కు  చెందిన శ్రీకాంత్, జగదేవిల  రెండో సంతానం జీవనిక. వీరు Hyderabad రెహ్మత్ నగర్లో నివసిస్తున్నారు. మంగళవారం  రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనం రెయిలింగ్ కూలింది. ఈ శిథిలాలు రేకుల షెడ్డులో నిద్రిస్తున్న  జీవనికపై పడ్డాయి. దీంతో ఆ చిన్నారి మృతి చెందగా శ్రీకాంత్, జగదేవిలు ప్రాణాలతో బయటపడ్డారు.  కొన్ని రోజులు  వుంటే ఇల్లు ఖాళీ చేసేవాళ్ళం మా పాప ప్రాణాలతో మాకు దక్కేది అని తల్లి దండ్రుల  రోదనలతో అక్కడ వున్నా వాళ్ళందరి కంటతడి పెట్టుకున్నారు

ఉదయం కాస్త విరామం ఇచ్చిన వాన మళ్లీ మొదలైంది. Hyderabad నగరంలోని ఇస్నాపూర్‌, తెల్లాపూర్‌, పటాన్‌చెరు, బాచుపల్లి, మియాపూర్‌, నిజాంపేట్‌, జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్‌, జీడిమెట్లా, లింగంపల్లి, మాదాపూర్‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌, బాలానగర్‌, ఖైరతాబాద్‌, నేరేడ్‌మెట్‌, అల్వాల్‌, మల్కాజిగిరిలో వర్షం కురుస్తున్నది. పలు ప్రాంతాల్లో స్వలంగా వాన పడుతున్నదని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక దక్షిణ హైదరాబాద్‌లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. అయితే సాయంత్రం మరోసారి వాన దంచికొట్టే అవకాశం ఉందని వెల్లడించింది.

Leave a Reply