Hyderabad News : హైదరాబాద్ లో దారుణం గోనె

Hyderabad News :

Hyderabad News : హైదరాబాద్ లో దారుణం గోనె సంచిలో ముక్కలు

 

Hyderabad News :హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. లంగర్‌హౌస్ దర్గా వద్ద మృతదేహం కలకలం సృష్టిస్తోంది.

రోడ్డు పక్కన గోనె సంచిలో మృతదేహం కనిపించింది. దుండగులు ముక్కలు ముక్కలుగా నరికి రెండు సంచిల్లో మృతదేహాన్ని నింపి పెట్టారు.

క్కడో హత్య చేసి సంచిలో మృతదేహాన్ని భాగాలుగా మూట కట్టారు.

అనంతరం ఆటోలో తెచ్చి లంగర్ హౌస్ దర్గా వద్ద పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. గురువారం రాత్రి 10:30 గంటల తర్వాత దర్గా మిలట్రీ హాస్పిటల్​సమీపంలో ఓ ఆటో ఆగింది.

అందులో నుంచి ఓ వ్యక్తి, ఓ మహిళ దిగారు. గోనె సంచి తెచ్చి పడేస్తుండగా, Hyderabad News :స్థానికులు గమనించి ఏమిటి అని అడిగారు.

సమాధానం చెప్పకుండా ఇద్దరూ ఆటోలో అక్కడి నుంచి జారుకున్నారు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు వచ్చి చూడగా గోనె సంచిలో డెడ్​బాడీ ఉన్నట్లు గుర్తించారు.

ముక్కలు, ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్​లో శరీర భాగాలను మూటగట్టినట్లు తెలిసింది.

వెంటనే వాటిని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని, డెడ్​బాడీ ఎవరిదో, తెచ్చి పడేసింది ఎవరో అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇంత దారుణంగా దుండగులు ఎందుకు చంపారనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.

Leave a Reply