Hyderabad: ఎల్బీనగర్‌లో భారీ అగ్ని

Hyderabad

Hyderabad: ఎల్బీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం…. 3 కోట్ల వరకు ఆస్తి నష్టం

Hyderabad: హైదరాబాద్‌ నగరంలో మంగళవారం రాత్రి రాత్రి 7.30 గంటలకు భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

ఎల్బీనగర్‌లోని ఒక టింబర్ డిపోలో ఒకసారిగా మంటలు చెలరేగాయి.

ఆ మంటలు ఉవ్వెత్తున ఎగిసి పక్కనే మల్టీప్లెక్స్, అపార్ట్మెంట్ నుంచి కార్ల గ్యారేజీకి మంటలు వ్యాపించాయి.

పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ త్వరితగతినవ్యాపిస్తూ ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి కాస్త ఆలస్యంగా వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఎల్బీ నగర్ చౌరస్తాకు సమీపంలో ఉన్న గుంటి జంగయ్య నగర్‌లోని ‘కార్‌ ఓ మ్యాన్‌’ గ్యారేజీ అగ్నికి ఆహుతైంది.

అయితే గ్యారేజీలో గ్యాస్ సిలిండర్లు ఉండడంతో అవి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ పేలిపోయాయి.

దీంతో ప్రమాద తీవ్రత మరింతగా పెరిగిపోయింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతూ షోరూంలోని

ఈ ప్రమాదంలో సుమారు 20 కార్లు Hyderabad:  కాలిపోయినట్లు అంచనా. అగ్ని కీలలు రెండు గంటలపాటు అదుపులోకి రాలేదు.

అయితే  ఓ సమయంలో పక్కనున్నఅపార్ట్‌మెంట్లకు వ్యాపించేలా మంటలు అటువైపు సాగాయి.

దాంతో విద్యుత్‌ సరఫరా నిలిపివేసి పలువురు బయటికి వచ్చారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా

శ్రమించడంతో రాత్రి 10.30 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి.  గ్యారేజీ వెనుకనున్న గృహోపకరణాల

షోరూంకు మంటలు అంటుకోకుండా సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీ మాట్లాడుతూ

మాట్లాడుతూ నాలుగు కార్లను సురక్షితంగా బయటకు తీశామని, మిగిలినవి కాలిపోయాయన్నారు.

అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదన్నారు. కాగా గ్యారేజీ యజమాని విజయ్‌కుమార్‌ Hyderabad: రాత్రి సంఘటనా

స్థలానికి చేరుకుని దాదాపు రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లిందంటూ లబోదిబోమన్నారు.

కాలిపోయిన కార్లను చూసి సొమ్మసిల్లి పడిపోయారు. అయితే ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేదా

మరేదైనా కారణం కావచ్చా.  అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అలాగే ముందు జాగ్రత్త చర్యగా, టింబర్ డిపో చుట్టుపక్కల వారిని ఇండ్ల నుంచి తరలిస్తున్నారు.

Leave a Reply