కొత్త సచివాలయ లో భారీ అగ్ని ప్రమాదం

Fire breaks out at new Telangana Secretariat

 

  కొత్త సచివాలయ లో భారీ అగ్ని ప్రమాదం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ నెల 17న ఘనంగా సచివాలయ ప్రారంభ వేడుకలకు ప్రభుత్వం మూహూర్తం కూడా  ఖరారు చేసింది. అయితే  ఇదే సమయంలో ఆకస్మికంగా సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

సచివాలయంలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో గుమ్మటం మీద భారీగా పొగలు కమ్ముకున్నాయి.   ఇక్కడ చెక్క పనులు చేస్తున్న క్రమంలో ఒక్క సారిగా మంటలు అంటుకున్నట్లు చెబుతున్నారు. మంటలు చెలరేగటంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఒకే సారి 11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు లోకి తీసుకొచ్చారు.  ప్రస్తుతానికి సచివాలయంలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఎలాంటి నష్టం జరగలేదు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
కొత్త సచివాలయ నిర్మాణం  మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరుగుతుంది. 10, 51,676 చదరపు అడుగుల్లో భవన నిర్మాణం తుది దశకు చేరుకుంది. 265 అడుగుల ఎత్తులో దీనిని నిర్మిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆరు అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భవనం పూర్తిగా డెక్కన్‌, కాకతీయ శైలిలో నిర్మాణం జరుగుతోంది. భవనానికి 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ సచివాలయ నిర్మాణానికి జూన్‌ 27, 2019న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈ నెల 17వ తేదీన నూతన సచివాలయ ప్రారంభానికి ముహూర్తంగా నిర్ణయించారు. ఈ ప్రాంభోత్సవానికి తమిళనాడు.. జార్ఖండ్ ముఖ్యమంత్రులు స్టాలిన్, హేమంత్ సోరెన్ తో పాటుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడుని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించినట్లు  సమాచారం.

ఇది కూడా చదవండి:

 

 

Leave a Reply