హైటెక్ సిటీ నుంచి అమెరికా పౌరులకు వల.. బ్యాంక్ ఖాతాలు హ్యాక్

హైటెక్ సిటీ కేంద్రంగా గుట్టూ చప్పుడు కాకుండా కేవలం రాత్రి వేళల్లోనే పనిచేస్తున్న కాల్ సెంటర్ పై సైబర్ సెక్యూరిటీ పోలీసులు దాడులు చేశారు. ఆత్యాధునిక లాప్టాప్ లు, ఖరీదైన మొబైల్ ఫోన్లతో ఆకర్షణమైన ఐడి కార్డులు ఉపయోగించి అమెరికాలో ఉన్న పే పాల్ కస్టమర్లను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. హైటెక్ సిటీ వేదికగా ఒక చిన్న రూమ్ ను రెంటుకు తీసుకొని కాల్ సెంటర్ ను స్థాపించారు. జనవరిలో మొదలైన ఈ కాల్ సెంటర్లో 63 మంది టెలికాలర్లు పనిచేస్తున్నారు. వీరంతా నార్త్ ఇండియాకు సంబంధించిన వారుగా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది. సోషల్ మీడియాలో టెలికాలర్స్ రిక్వైర్మెంట్ పేరుతో ప్రకటనలు జారీ చేయటంతో చాలామంది నార్త్ ఇండియాకు సంబంధించిన వారు ఈ ప్రకటనను చూసి ఇక్కడ చేరారు. వీరికి కొన్ని రోజులపాటు శిక్షణ ఇచ్చారు. ఏ తరహా లో యూఎస్ సిటిజెన్సును టార్గెట్ చేయాలి.. ఎలా వారి నుంచి అకౌంట్ వివరాలు తెలుసుకోవాలి అనే దానిపై పూర్తి శిక్షణ ఇచ్చిన తరువాత ప్రతిరోజు ఒక 30 కాల్స్ చేయాలంటూ ఒక్కొక్క టెలికాలర్ కు టార్గెట్ విధిస్తారు. ఒక రోజులో అందరూ టెలి కాలర్స్ నుంచి సుమారు 600కు పైబడి కాల్స్ అమెరికన్ సిటిజన్స్ కు వెళ్తున్నాయి.

అయితే వీరి వద్ద పే పాల్ కు సంబంధించిన వినియోగదారుల డేటాఎలా వచ్చింది అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా దుబాయ్ లో ఉన్న ఒక నిందితుడి నుంచి ఈ డేటాను కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డేటా లో ఉన్న పేపాల్ వినియోగదారులకు తమ ఖాతాలోని డబ్బు డెబిట్ అయినట్లు నకిలీ సెంటర్ నుంచి ఒక మెసేజ్ పంపిస్తారు. ఒకవేళ లావాదేవీ జరుగుతుంటే వెంటనే పలానా నెంబర్ కి ఫోన్ చేయండి అంటూ వీరి ఫోన్ నెంబర్ ను అక్కడ జతపరుస్తారు. ఇది నిజమైన మెసేజ్ ఏమోనని నమ్మిన అమెరికన్ సిటిజన్ వెంటనే వీరిని సంప్రదిస్తారు. ఆ డబ్బు రిఫండ్ కావాలంటే కొంత డబ్బు చెల్లించాలి అంటూ వారిని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి చెల్లింపులు చేపడుతున్నారు.

ఇలా అమెరికా సిటిజెన్స్ ను టార్గెట్ చేస్తూ వారి డేటాను అపహరించి దానితో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇందులో టెలికార్స్ గా పని చేస్తున్న వారికి సైతం సైబర్ నేరం చేస్తున్నాం అని తెలిసినప్పటికీ వారు 30 వేల రూపాయల జీతం కోసం ఆశపడి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో పాటు నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఈ టెలీకాలర్స్ అందర్నీ పగడ్బందీగా చూసుకుంటూ వచ్చారు. మాదాపూర్ లోని ఒక హాస్టల్ ని రెంటుకు తీసుకొని ఈ 63 మందిని ఒకే దగ్గర ఉంచి కేవలం వీరు బుక్ చేసిన క్యాబ్ ల్లో మాత్రమే వెళ్లే విధంగా ప్లాన్ చేశారు. అలా మొత్తం 63 మందికి విదేశాల్లో ఉన్న పేపాల్ కస్టమర్స్ ను ఎలా ట్రాప్ చేసి నేరాలకు పాల్పడాలో ట్రైన్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో బాధితులు మొత్తం అమెరికన్ సిటిజెన్స్ కావటంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు త్వరలోనే యూఎస్ కాన్సిలేట్ కు ఉత్తరం రాయనున్నారు. మరోవైపు పే పాల్ యాజమాన్యాన్ని సైతం సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అలర్ట్ చేయనున్నారు.

Leave a Reply