Cooking Oil: శుభవార్త భారీగా తగ్గిన వంట నూనె ధరలు

Cooking Oil

Cooking Oil: శుభవార్త భారీగా తగ్గిన వంట నూనె ధరలు

Cooking Oil: సామాన్యు ప్రజలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి మా ఎందుకంటే . కేంద్రం దేశ వ్యాప్తంగా వంట నూనెలు ధరలు తగ్గుతాయని వెల్లడించింది. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు దేశంలో విపరీతంగా పెరిగిపోయిన విషయం తెల్సిందే. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి ధరలు తగ్గినప్పటికీ దేశీయంగా మాత్రం ధరలు తగ్గలేదు ఈ నేపథ్యంలో ఈ ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే రానున్న 3 వారాల్లోగా తక్కువ రేటులో ఆయిల్ సామాన్యులకు అందుబాటులోకి వస్తుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ధారా బ్రాండ్‌పై వంట నూనెలు విక్రయిస్తున్న మదర్ డెయిరీ ఆయిల్ రేట్లను భారీగా తగ్గించింది. వంట నూనె గరిష్ట విక్రయ ధరను లీటర్‌పై రూ.15 నుంచి 20 రూపాయల వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది మదర్ డెయిరీ. తక్షణమే ఈ ధరల తగ్గింపు అమల్లోకి వచ్చిందని వెల్లడించింది.  అలాగే  సోయాబీన్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, వేరుసెనగ నూనె ధరలను కూడా తగ్గించింది.

ధార రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ లీటర్ పాలీప్యాక్ ధర రూ.170 నుంచి రూ.150కి తగ్గింది. రైస్ బ్రాన్ ఆయిల్ లీటర్ ధర రూ.190 నుంచి రూ.179కి తగ్గింది. ధారా సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ.175 నుంచి రూ.160కి తగ్గింది. వేరుశెనగ నూనె ధర రూ.255 నుంచి రూ.240కి తగ్గింది. అయితే ధరలు ఇప్పటికే తగ్గగా సవరించిన MRP ధరలతో ప్యాకెట్లు వచ్చే వారం నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

అలాగే సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా తన సభ్యులను గత మూడు నెలల్లో ధర తగ్గింపు వివరాలను ఆహార మంత్రిత్వ శాఖకు సమర్పించాలని కోరింది. అంతకుముందు, ఆహార సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎడిబుల్ ఆయిల్ తయారీ కంపెనీలను ఎడిబుల్ ఆయిల్ ధరలను తగ్గించాలని కోరింది. దీంతో ఇతర కంపెనీలు కూడా అతి త్వరలోనే ఆయిల్ ధరల్ని తగ్గించనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply