Bandla Ganesh : త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్‌ సంచలన ట్వీట్‌!

Bandla Ganesh : త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్‌ సంచలన ట్వీట్‌!

Bandla Ganesh : టాలీవుడ్ కమెడియన్ గా, నిర్మాతగా బండ్ల గణేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

నిర్మాతగా ఆయన మంచి సక్సెస్ ను చూశారు. అటు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి  తనదైన శైలిని చూపించారు.

ఇదిలా ఉంటే బండ్లన్న ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటారు.

ఎప్పుడు ఎవరిపై విరుచుకుపడతారో ఎవ్వరూ ఊహించలేరు. అయితే అలా విరుచుకుపడడం వెనక ఆయన కారణాలు ఆయనకుంటాయి.

కొన్నిసార్లు రాజకీయ కారణాలతో, మరికొన్నిసార్లు సినీ కారణాలతో, ఇంకొన్నిసార్లు వ్యక్తిగత, వ్యాపార కారణాలతో బండ్ల విరుచుకు పడుతుంటారు.

ఆయా అంశాలపై తన అభిప్రాయాన్ని నిర్భయంగా వ్యక్త పరుస్తుంటారు. అవి సంచలనంగా మారుతుంటాయి.

అలాగే మొన్నటికిమొన్న హరీశ్ శంకర్, బండ్ల గణేశ్ మధ్య నడిచిన మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే.

ఇప్పుడు త్రివిక్రమ్ పై ఫోకస్ పెట్టాడు ఈ నిర్మాత కమ్ బిజినెస్ మేన్. త్రివిక్రమ్ ను ఇండస్ట్రీలో అంతా గురూజీ అంటారనే విషయం తెలిసిందే.

కాబట్టి బండ్ల గణేశ్ కూడా గురూజీ అంటూ అందుకున్నాడు.

అయితే అసలు విషయానికి వస్తే  తాజాగా బండ్ల గణేష్ తన అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘బండ్లన్న నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి ఆయన ఇచ్చిన రిప్లై హాట్ టాపిక్ గ్గా మారింది.

‘గురూజీని కలవండి మరియు ఖరీదైన బహుమతులు ఇవ్వండి..

అప్పుడు మీరు అనుకున్నది జరుగుతుంది’ అంటూ  Bandla Ganesh : బదులిచ్చారు.

ఈ మాటలు త్రివిక్రమ్ ను ఉద్దేశించే చేసినవని స్పష్టమవుతున్నట్టు నెటిజన్లు భావిస్తున్నారు.

అలాగే  మరో నెటిజన్ గురూజీ కథలు పూర్తిగా మార్చేస్తాడట అని అడిగాడు. దానికి బదులుగా బండ్ల గణేష్.

. తల్లిదండ్రులను, అన్నాదమ్ములను, ప్రాణస్నేహితులను కూడా మార్చేస్తాడు అది గురూజీ స్పెషాలిటీ అంటూ మరో ట్వీట్ చేసాడు.’

అంటూ ఇచ్చిన రిప్లై సంచలనంగా మారింది. గురూజీ అంటే తెలుగు ఇండస్ట్రీలో త్రివిక్రమనే అందరికీ తెలుసు. ప్రస్తుతం బండ్లన్న కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

అయితే ఆమధ్య కూడా ఒక ఫోన్ కాల్ లో త్రివిక్రమ్ గురించి తప్పుగా మాట్లాడాడు బండ్ల గణేష్.

దానికి కారణం  Bandla Ganesh : పవన్ నుండి బండ్ల గణేష్ ను దూరం చేయడమే.

ఆ కోపంతోనే బండ్ల గణేష్ ఇప్పుడు ఇలా ట్వీట్స్ చేసాడని అర్థమవుతోందిదీనిపై ఇక త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply