Avinash Reddy Bail: వివేకా హత్య కేసులో ఉత్కంఠ

Avinash Reddy Bail

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై ఉత్కంఠ

Avinash Reddy Bail: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టులో ఈ రోజు నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. కోర్టు తీర్పు తరువాత సీబీఐ అడుగుల పైన ఆసక్తి నెలకొంది. వివేకా హత్య కేసుల సీబీఐ ఇప్పటికే ఎంపీ అవినాష్ ను సుదీర్ఘంగా విచారించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన తరువాత మరోసారి అవినాష్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ మొదలైంది.

అయితే  ఎంపీ అవినాష్‌రెడ్డి దర్యాప్తునకు సహకరించలేదని సీబీఐ వాదనల నేపథ్యంలోనే  రాతపూర్వక ప్రశ్నలు, సమాధానాలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలంగాణ హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. Avinash Reddy Bail పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ కె.సురేందర్‌ విచారణ చేపట్టారు. వివేకా కుమార్తె సునీత తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ. ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసిందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ అవినాష్‌రెడ్డి విచారణకు సహకరించడం లేదని, సమాధానాలు చెప్పడం లేదన్న సీబీఐ వాదనల నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

కానీ వివేకా హత్య స్థలంలో సాక్ష్యాల ధ్వంసంలో అవినాష్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని సునీత తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలిపారు. రక్తపు మరకలను తుడిచి వేయాలంటూ అవినాష్‌రెడ్డి చెప్పినట్లు ఆ పని చేసిన మహిళ వాంగ్మూలం ఇచ్చారన్నారు. రక్తపు మడుగులో వివేకా మృతదేహం ఉన్నప్పటికీ గుండెపోటుగా చెప్పారన్నారు. అలాగే చెప్పాలంటూ సీఐని బెదిరించారన్నారు.

అయితే రక్తపు మరకలు శుభ్రం చేసిన మహిళ తర్వాత మాట మార్చిందన్నారు. మూడు సిట్‌ బృందాలు దర్యాప్తు చేపట్టినప్పటికీ అది సక్రమంగా సాగకపోవడంతో సీబీఐకి బదలాయించారన్నారు. సీబీఐ దర్యాప్తు చేపట్టాక పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. అవినాష్‌రెడ్డిపై కేసుల్లేవనడం వాస్తవం కాదన్నారు. తనపై హత్యాయత్నం కేసు నమోదైందని ఆయన ఎన్నికల అఫిడవిట్‌లోనే పేర్కొన్నారన్నారు. అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ సమాచార హక్కు కింద ప్రభుత్వం ఇచ్చిన సమాచారం కంటే ఆధారమేం కావాలన్నారు. ప్రభుత్వమే మీదని సునీత న్యాయవాది వ్యాఖ్యానించారు. గూగుల్‌ టేకౌట్‌ ప్రకారం పిటిషనర్‌ 500 మీటర్ల దూరంలోనే ఉన్నారన్నారు. పిటిషనర్‌ చెబుతున్నట్లుగా ఆ రోజు జమ్మలమడుగులో లేరని, ఇంట్లోనే ఉన్నారన్నారు. వివేకా హత్య కేసులో కుట్ర బయటికి రావాలంటే ఈ దశలో పిటిషనర్‌కు ముందస్తు బెయిలు ఇవ్వరాదన్నారు. సీబీఐ వాదనల నిమిత్తం న్యాయమూర్తి విచారణను శుక్రవారానికి మధ్యాహ్నానికి వాయిదా వేసింది. ఈ రోజు వాదనలు పూర్తయిన తరువాత కోర్టు తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.Avinash Reddy Bail పిటీషన్ పైన కోర్టు నిర్ణయానికి అనుగుణంగా సీబీఐ తమ నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీంతో కోర్టు నిర్ణయం పైన ఉత్కంఠత  నెలకొని ఉంది.

Leave a Reply