APPSC Jobs: గ్రూప్‌ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లకు

APPSC Jobs

APPSC Jobs: గ్రూప్‌ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లకు

APPSC Jobs:ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వారికి సీఎం జగన్ శుభవార్త చెప్పారు.

రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గ్రూప్‌-1కి సంబంధించి సుమారు

100కిపైగా పోస్టులు, గ్రూప్‌-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు, మొత్తంగా 1000కిపైగా పోస్టులు

భర్తీచేయనున్నామని తెలిపారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని సీఎం

ఆదేశించారని. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని

వెల్లడించారు. అతి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుందని పేర్కొన్నారు.

గురువారం ఉదయం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలపై అధికారులు ముఖ్యమంత్రితో చర్చించారు.

పోస్టుల భర్తీకి అవసరమైన వివరాలు సిఎంకు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా

సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు.

గ్రూప్-1,2 పోస్టుల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన రావడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రిపేరేషన్ పూర్తి చేసుకుని.. నోటిఫికేషన్ల కోసం APPSC Jobs: చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే

నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో సంతోషంగా ఉన్నారు. గ్రూప్‌ 1, 2లో ఏయే పోస్టులను భర్తీ చేయనున్నారు..?

సిలబస్‌ ఎలా ఉంటుంది..? వంటి వివరాలను అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. త్వరలోనే పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జీవోను విడుదల చేయనుంది.

Leave a Reply