జీ20 సదస్సులో నాటు నాటు’ పాటకు దుమ్మురేపిన రామ్ చరణ్ ‘

జమ్ము, కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు భారీగా హాజరయ్యూరు.  ఈ సదస్సు మే 22 నుంచి మూడు రోజుల పాటు అంటే మే 24వ తేదీ వరకు జరుగుతాయి.  కాగా.. శ్రీనగర్‌లో జరిగే ‘‘జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్’’లో పాల్గొనాల్సిందిగా రామ్ చరణ్‌కు ఆహ్వానం అందింది. అయితే ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. టూరిజం డెవలప్‌మెంట్, ఇండియాలో పర్యాటక అభివృద్ధి అంశాల లక్ష్యంగా నిర్వహిస్తున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సు కోసం రాంచరణ్ సోమవారం ఉదయం కు  శ్రీనగర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రామ్ చరణ్ కు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. రామ్ చరణ్ కు కశ్మీరీ తలపాగా చుట్టారు సోమవారం ఉదయం నిర్వహించిన సదస్సులో కొరియన్ అంబాసిడర్ చాంగ్ జే బాక్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సదస్సుకు హాజరైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి రామ్ చరణ్ కు శాలువా కప్పి, జ్ఞాపిక అందజేశారు.

ఇక ఈ వేదికపై  కొరియన్ అంబాసిడర్ చాంగ్ జే బాక్ కోరిక మేరకు రాంచరణ్ ఆయనకు స్టెప్పులు నేర్పించారు. ఆ తర్వాత లయబద్దంగా నాటు నాటుకు స్టెప్పులేసి ఆకట్టుకొన్నారు.
ఇక ఆయన మాట్లాడుతూ తాను 1986 నుంచి కశ్మీర్‌కు తరచుగా వస్తున్నానన్న రామ్‌చరణ్‌ కశ్మీర్‌లో తన తండ్రి చిరంజీవి సినిమాలు ఎక్కువగా షూటింగ్‌ జరిగేవని గుర్తుచేశారు. గుల్మార్గ్‌, సోన్ మార్గ్‌లో ఎక్కువ షూటింగ్‌లు జరిగేవని కశ్మీర్‌ ప్రాంతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని రామ్ చరణ్ తెలిపారు. జీ-20 సదస్సు జరుగుతున్న ఇదే ఆడిటోరియంలో 2016లో తన సినిమా షూటింగ్‌ జరిగిందని చరణ్‌ గుర్తు చేసుకున్నారు.

ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ఇప్పటికే డెలిగేట్లు శ్రీనగర్‌కు చేరుకొన్నారు. శ్రీనగర్‌కు వెళ్లే దారి పొడుగునా జీ20 లోగోలను ఏర్పాటు చేశారు. వీధులను, రోడ్లను సుందరీకరించారు. శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి షేర్ ఏ కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వరకు రోడ్డు పొడుగునా టూరిజానికి సంబంధించిన బ్యానర్లతో అలంకరించార.

Leave a Reply