Minister KTR: ప్రపంచ వేదికపై తెలంగాణ జల విజయం

Minister KTR

Minister KTR: ప్రపంచ వేదికపై తెలంగాణ జల విజయం చాటిచెప్పిన కేటీఆర్

Minister KTR: తెలంగాణ సాధించిన జల విజయగాథలను ప్రపంచ వేదికపై చాటేందుకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలో నిర్మాణమైన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు, ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందిస్తున్న మిషన్‌ భగీరథ ప్రాజెక్టు సాధించిన విజయాలను వివరించనున్నారు.

అమెరికాలోని నెవడా రాష్ట్రం హెండర్సన్‌ ఈనెల 21 నుంచి 25 వరకు జరగనున్న ‘అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజినీర్స్‌(ఏఎస్‌సీఈ)- వరల్డ్‌ ఎన్విరాన్మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ కాంగ్రెస్‌’లో ప్రారంభోపన్యాసం చేసేందుకు సంస్థ ఆహ్వానం మేరకు మంత్రి కేటీఆర్‌ అమెరికా వెళ్లారు.

Also Watch

E-Chits: మొబైల్ యాప్‌ను ప్రారంభించిచిన మంత్రి ధర్మాన

సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రణాళికల గురించి2017లో అమెరికాలోని శాక్రమెంటోలో జరిగిన ఏఎస్‌సీఈ సదస్సులో సైతం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ ప్రణాళికల గురించి కేటీఆర్‌ వివరించారు.

ఈ భారీ పథకాల ప్రణాళికలపై నాడు ఆసక్తి ప్రదర్శించిన ఏఎస్‌సీఈ… 2022 సంవత్సరంలో తెలంగాణలో స్వయంగా పర్యటించింది.

కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రత్యేకంగా సందర్శించిన ఆ సంస్థ ప్రతినిధుల బృందం, తెలంగాణ సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఓ గేమ్‌ ఛేంజర్‌ అని ప్రశంసించింది.

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును స్వల్ప కాలంలోనే పూర్తి చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన అమెరికన్‌ సివిల్‌ ఇంజినీర్స్‌ సొసైటీ సంస్థ ఆ విజయగాథను, తెలంగాణ ప్రభుత్వ ఘనతను అమెరికాలో వివరించేందుకు రావాలని మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది.

అమెరికాలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి హాజరయ్యే సివిల్‌ ఇంజినీర్ల సమక్షంలో మంత్రి కేటీఆర్‌ సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరించనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, దాని ద్వారా అందుతున్న ఫలాలు, ఇతర ప్రణాళికలపై కేటీఆర్‌ పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు.

కాళేశ్వరం, మిషన్‌ భగీరథ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో వచ్చిన సామాజిక, ఆర్థిక ప్రగతిని వివరించనున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో సాగునీటి రంగంలో సాధించిన విజయాలను ప్రపంచ వేదికపై వివరించే అవకాశం దకడం పట్ల కేటీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు.

Leave a Reply