మేము ఒంటరిగానే పోటీ చేస్తాం: మమతా బెనర్జీ

mamatas said can not longer

Mamata Banerjee: ఇంకా మేము ఒంటరిగానే పోటీ చేస్తాం

పశ్చిమ బెంగాల్‌లో ముర్షిదాబాద్‌ జిల్లాలోని సాగర్డిఘి ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓటమిపాలైన సంగతి అందరకి  తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్‌, సీపీఎంలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మహా ప్రతి పక్ష కూటమి ఆశకు ఎదురు దెబ్బతగలడంతో ఒక్కసారి మమతా ఆయా పార్టీలపై ధ్వజమెత్తారు.

భారతీయ జనతా పార్టీ(బీజేపీ), కాంగ్రెస్‌, సీపీఎంల అపవిత్ర పొత్తులను మరోసారి బహిర్గతం చేసిందంటూ మండిపడ్డారు. తమ పార్టీ మూడు ‍ప్రత్యర్థి రాజకీయ శక్తులతో ఒంటరిగానే పోటీ చేస్తుందంటూ శపథం చేశారు.అయినా బీజేపీతో ఉన్న కాంగ్రెస్‌, సీపీఎంలతో చేరితే మమ్మల్ని బీజేపి వ్యతిరేకి అని ఎలా పిలుచుకుంటారని ప్రశ్నించారు. వారంతా కమ్యూనల్‌ కార్డ్‌ ఆడుతున్నారు.

సాగర్దిఘిలో ఓటమే మాకు గుణపాఠం ఇకపై కాంగ్రెస్‌ని సీపీఎంని నమ్మేదే లేదని తేల్చి చెప్పారు. అయినా బీజేపీతో ఉ‍న్న పార్టీలతో వెళ్లలేం అన్నారు. మా పొత్తు ప్రజలతోనేనని  ఆమె ధీమాగా గా చేప్పారు. సాగర్దిఘి ఉప​ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి గురించి మాట్లాడుతూ మేము ఎన్నికల్లో ఓడిపోయాం. ఎవరినీ నిందించను ఎందుకంటే ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఐతే ఇందులో ఇద్దరి మద్ద జరిగిన అనైతిక పొత్తు కారణంగా ఓట్లన్నీ కాంగ్రెస్‌కి పడ్డాయి.

అదీగాక మేఘాలయ ఎన్నికల్లో కొంత గందరగోళం కూడా నెలకొంది. రెండు పార్టీలకు కాంగ్రెస్‌ అనే పదం కామన్‌గా ఉండటంతో తాను కాంగ్రెస్‌తోనే ఉన్నానని ఓటర్లు భావించారు. నేను కాంగ్రెస్‌లో ఉన్నందున, కాంగ్రెస్‌ రోజలు నుంచి నా చిత్రాన్ని వారితో చూడటంతో ఓటర్లు కాస్త గందరగోళానికి గురయ్యారు. అయినప్పటికీ మేఘాలయలో టీఎంసీ ఐదు సీట్లు గెలిచేందుకు సాయం చేశారు. అందుకు అభినందనలు.

టీఎంసీ ఆరు నెలల క్రితమే మేఘాలయలో ప్రచారం ప్రారంభించినప్పటికీ పోలైన మొత్తం ఓట్లలో 15శాతం సాధించాం. వచ్చే ఎన్నికల్లో మరింత రాణిస్తాం.” అని మమత ధీమాగా చెప్పారు. కాగా, ఎన్నికల సంఘం విడుదల చేసిన లెక్కల ‍ ప్రకార త్రిపురలో బీజేపీ మెజారిటీ మార్కును దాటి 32 సీట్లు గెలుచుకోగా కలిసి పోటీ చేసిన సీపీఎం, కాంగ్రెస్‌లు ఏకంగా 14 స్థానాల్లో విజయం సాధించాయి. బీజేపీ మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర ఒక్క సీటును గెలుచుకుంది. అయితే, త్రిపురలో టీఎంసీ ఖాతా తెరవలేకపోయింది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh