బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమోషనల్ అయిన హరీష్ రావు

MINISTAR HARISH RAO:బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమోషనల్ అయిన హరీష్ రావు

సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్‌లో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమేళనంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఫర్హూక్ హుస్సేన్, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాయి చంద్ పాటలతో ఈ సబ మార్మోగింది. ఈ సభలో నాయకులు, కార్యకర్తలు డాన్స్‌లతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడగా కాస్త ఎమోషనల్ అయ్యారు.

ఇంత ఆదరాభిమానాలు చూస్తుంటే నాకు దుఃఖం వస్తుంది ఎంతో ఉత్సాహం చూస్తుంటే నాకు ఆనందం ఐతుంది. నా చివరి శ్వాస వరకు మీకు సేవ చేస్తా. నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే. చింతమడక బిడ్డ వల్ల రాష్ట్రం వచ్చింది. గతంలో వర్షాలు లేక కప్ప తల్లి ఆటలు ఆడేవారు కానీ ఇప్పుడు మండు ఎండలో కూడా చెరువుల్లో మత్తలు దుంకుతున్నాయి. 2014లో పండిన పంటల కంటే తెలంగాణ వచ్చి ప్రాజెక్టులు కట్టిన తర్వాత పది రెట్లు కంటే ఎక్కువ ధాన్యం పండిస్తున్నాం. కంటి వెలుగు పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు’ అని హరీష్ రావు పేర్కొన్నారు.

అయితే అసలు ‘కాంగ్రెస్, తెదేపా పాలనలో అభివృద్ధి కంటే బీఆర్ఎస్ వచ్చాక అభివృద్ధి చాలా అభివృద్ధి ఎక్కువ అయ్యింది. మోడీ వచ్చి బురద చల్లే ప్రయత్నాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని అంటున్న మోడీ రైల్వే కోచ్ ఎందుకు ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు.. తెలంగాణ అభివృద్ధి చెందకుండా బీజేపీ అడ్డుకుంటుంది.

రానున్న రోజుల్లో గృహలక్ష్మీ పథకం తెసుకొస్తున్నాం. దేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటే ఎక్కడ కూడా పెన్షన్ పథకం లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నారు’ అని హరీష్ రావు తెలిపారు.

‘సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తాం. మీ దయ, ముఖ్యమంత్రి కేసీఆర్ దయ వల్ల ఆరోగ్యశాఖ మంత్రిగా ఉంటున్నాను’ అని హరీష్ చెప్పారు. అయితే రాష్ట్రంలో ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండటంతో ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఈ సమావేశాలు ఏర్పాడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుపొందాలనే విషయంపై ఈ సమ్మేళనాల్లో కార్యకర్తలకు నాయకులు సూచనలు చేస్తున్నారు. పలుచోట్ల ఆత్మీయ సమ్మేళనాల్లో నేతల మధ్య విబేధాలు బయటపడుతున్నాయి.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh