హస్తినకు జనసేనాని వెళ్ళడానికి అసలు కారణం అదే!

 PAWAN Kaliyan Delhi tour :హస్తినకు జనసేనాని వెళ్ళడానికి అసలు కారణం అదే!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  హస్తి నాకు వెళ్ళిన విషయం తెలిసిందే. గత రాత్రి హస్తినకు చేరుకున్న ఆయన నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లతో భేటీ కానున్నారు. భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా జనసేన ఉంది.

అసలు  రెండు పార్టీలూ కలిసి పోరాటం చేయడంలేదు ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోలేక పోయాయి బిజెపి జాతీయ నేతలు తమ పట్ల సానుకూలంగా ఉన్నా రాష్ట్ర నాయకత్వం సరిగా వ్యవహరించడం లేదని పవన్ అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. నేడు ఆయన రెండో రోజు ప్రముఖులతో భేటీ అవనున్నారు.

జనసేన  పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధరన్‌తో కీలక మంతనాలు జరిపారు.పవన్ రాత్రి ఇంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ శకావత్ తో భేటీ అయ్యారు. నేటి ఉదయం తిరిగి మురళీ ధరన్‌తో భేటీ అయ్యారు.

బీజేపీతో కలిసి పనిచేసే విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది.  వైసీపీని ఢీకొనే విషయంలో తమతో కలిసి పనిచేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నదా లేదా అని తేల్చుకునేందుకే వారు ఢిల్లీ వచ్చినట్లు సమాచారం. ఈ చర్చల ఆధారంగా భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించుకోవాలని పవన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అలాగే పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో బిజెపి-టిడిపి-జనసేన కలిసి పోటీ చేయాలని పవన్ సూచిస్తున్నారు.  టిడిపితో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ప్రసక్తే లేదని, తమ పొత్తు జనసేనతో మాత్రమేనని బిజెపి రాష్ట్ర నేతలు కరాఖండిగా  చెబుతున్నారు. జనసేన తమతోనే ఉందని బిజెపి రాష్ట్ర నేతలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తమ పార్టీ సహకారం కూడా కోరలేదని ఆయన చెప్పే వీలుంది. కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు జగన్‌తో కుమ్మక్కయ్యారని, కేంద్రంలో ఉన్న బీజేపీ అగ్రనేతలు వారికి ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేయకపోవడమే ఇందుకు కారణమని పవన్‌ భావిస్తున్నారు.

అలాగే జగన్‌కు మాటిమాటికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వడం, కొన్ని కీలకమైన కేసుల విషయంలో ఆయనకు అండదండలందిస్తున్నారనే అభిప్రాయం కూడా ప్రజల్లో కలుగుతోందని బీజేపీ అగ్రనాయకత్వానికి పవన్‌, మనోహర్‌ వివరించే అవకాశాలున్నాయి. కాగా, రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కేంద్రం చొరవ చూపాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు.

ఏపీ రాజకీయ అంశాలతో పాటు, తెలంగాణకు సంబంధించిన పరిస్థితులపై కూడా బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉందని  తెలుస్తోంది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తరువాత పవన్ హస్తిన టూర్ ఆసక్తిని సంతరించుకుంది. ప్రతిపక్షాలపై వైసీపీ దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని పవన్  ఇప్పటికే  ప్రకటించారు.

అలాగే మరోవైపు, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయించాలని బిజెపి అధిష్టానం భావిస్తున్న దృష్ట్యా ఈ విషయమై చర్చించేందుకే ఆయన్ను ఢిల్లీకి పిలిపించారని తెలుస్తోంది

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh