నేను బీజేపీకు మద్దతు ఇవ్వడంలో నిజం లేదు : కన్నడ నటుడు

Kicha Sudeep Comments: నేను బీజేపీకు మద్దతు ఇవ్వడంలో నిజం లేదు : కన్నడ నటుడు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న సినీ నటులు, నటీమణులను పార్టీల్లోకి తీసుకురావాలని పలువురు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. సినిమా ఆర్టిస్టులు రాజకీయాల్లోకి రావడం, పార్టీ తరుపున ప్రచారం చేయడం సర్వసాధారణం. ఇప్పుడు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయం అని అంటున్నారు. రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలువురు రాజకీయ నేతలు సుదీప్ ఇంటి తలుపు తట్టారు. ఆయనతో పాటు కన్నడ నటుడు దర్శన్ సైతం బీజేపీలో చేరనున్నాడని తెలుస్తోంది. అయితే ఏది నిజం, ఎంతవరకూ నిజమనేది పరిశీలిద్దాం.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సినీ గ్లామర్ వాడుకునేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొందరు వివిధ పార్టీల కండువాలు కప్పుకుంటున్న పరిస్థితి ఉంది. తాజాగా కన్నడ నటులు కిచ్చా సుదీప్, దర్శన్‌లు బీజేపీలో చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. కిచ్చా సుదీప్ ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే కాకుండా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు కావడంతో అతని చేరిక లాభిస్తుందనే ఆలోచనలో పార్టీ ఉంది.  ఇక మరో నటుడు దర్శన్ ఇప్పటికే ఆర్ఆర్ నగర్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి తరపున ప్రచారం చేశారు. అంబరీష్ మరణానంతరం మాండ్యా లోక్‌సభ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధిగా సుమలత పోటీ చేసినప్పుడు కూడా దర్శన్ ప్రచారం చేశాడు.

కిచ్చా సుదీప్ బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారని, తనకు మద్దతు తెలిపారని స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై మీడియా సమావేశంలో వెల్లడించారు. దాంతో బీజేపీలో చేరినట్టు, ఎన్నికల్లో పోటీ కూడా చేస్తారనే ప్రచారం సాగింది. ఆ తరువాత సుదీప్ దీనిపై స్పష్టత ఇచ్చారు. బసవరాజ్ బొమ్మై నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నా మద్దతు ఆయనకే కష్టకాలంలో నాకు అండగా నిలిచినవారికి నేను పనిచేస్తాను. నేను రాజకీయాల్లోకి రావడం లేదు, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సుదీప్ స్పష్టం చేశారు. తాను మద్దతిచ్చేది కేవలం బసవరాజ్ బొమ్మైకు మాత్రమేనని బీజేపీకు కాదని కూడా తెలిపారు. బసవరాజ్ బొమ్మై తరపున ప్రచారం, సభలు నిర్వహిస్తాను కానీ బీజేపీకు మద్దతు కాదని వివరణ ఇచ్చారు. అటు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఈ విషయంపై మరోలా స్పందించారు. ఆయన అంటే కిచ్చా సుదీప్  నాకు మద్దతు పలికారు. నాకు మద్దతు ఇస్తున్నారంటే బీజేపీకు మద్దతు ఇస్తున్నట్టే కదా కదా అని వ్యాఖ్యానించారు.

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఫిబ్రవరిలో కిచ్చా సుదీప్‌ను ఆయన నివాసంలో కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, వారిద్దరి కలయికకు రాజకీయ ప్రాధాన్యం లేదని, వ్యక్తిగత కారణాలతో కలిశారని సుదీప్ సన్నిహితులు తెలిపారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh