PIA Plane: భారత గగనతలంలోకి పాకిస్థాన్ విమానం

PIA Plane

PIA Plane: భారత గగనతలంలోకి పాకిస్థాన్ విమానం

PIA Plane: భారత గగనతలంలోకి పాకిస్థాన్ విమానం ప్రవేశించింది. దాదాపు పది నిమిషాల పాటు ఆ విమానం భారత గగనతలంపైనే ప్రయాణించిందిన. మే 4వ తేదీ రాత్రి 8గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మస్కట్ నుండి తిరిగి వస్తున్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) విమానం  లాహోర్ వెల్లుతున్నబోయింగ్ 777కి చెందిన పీకే248 విమానం లాహోర్  విమానాశ్రయంలో ల్యాండ్ కావడంలో విఫలమైంది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భారీ వర్షం కురవడంతో లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే అవకాశం లేకపోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అది భారత గగనతలంలో దాదాపు పదిన నిమిషాల పాటు ప్రయాణించింది.

భారత గగనతలంలో ఎగురుతున్న సమయంలో కెప్టెన్ విమానాన్ని 20,000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లగా, విమానం భారత గగనతలంలో ఏడు నిమిషాల పాటు ఎగిరింది. ఆ తర్వాత భారత పంజాబ్ లోని జగియాన్ నూర్ ముహమ్మద్ గ్రామం నుంచి ఈ విమానం తిరిగి పాక్ గగనతలంలోకి ప్రవేశించింది. పాకిస్తాన్ పంజాబ్ లోని కసూర్ జిల్లాలోని డోనా మాబోకి, చాంత్, ధుప్సారి కసూర్, ఘాటి కలంజర్ గ్రామాల గుండా ఈ విమానం భారత గగనతలంలోకి తిరిగి ప్రవేశించింది.

మూడు నిమిషాల తర్వాత భారత పంజాబ్ లోని లఖా సింగ్ వాలా హితార్ గ్రామం నుంచి విమానం తిరిగి పాక్ భూభాగంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో విమానం 320 కిలోమీటర్ల వేగంతో 23,000 అడుగుల ఎత్తులో ఉంది. పాక్ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత విమానం ముల్తాన్ కు వెళ్లింది. ఈ విమానం భారత భూభాగంలో మొత్తం 120 కిలోమీటర్లు దాదాపు పది నిమిషాల పాటు ప్రయాణించింది.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచనల మేరకు పైలట్ గో-రౌండ్ విధానాన్ని ప్రారంభించాడని, ఈ సమయంలో భారీ వర్షం, తక్కువ ఎత్తు కారణంగా అతను దారి తప్పాడని పత్రిక తెలిపింది. గంటకు 292 కిలోమీటర్ల వేగంతో 13,500 అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఈ విమానం బదానా పోలీస్ స్టేషన్ నుంచి భారత గగనతలంలోకి ప్రవేశించింది. భారత పంజాబ్ లోని తరణ్ సాహిబ్, రసూల్ పూర్ నగరాల గుండా 40 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత విమానం నౌషెహ్రా పన్వాన్ నుంచి వెనుదిరిగింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh