ముక్కు మూసుకుపోవడం, జలుబు, దగ్గు సమస్యలను అధిగమించేందుకు చాలా ఆయుర్వేద పద్ధతులు ఉన్నాయి.
అందులో ఆవిరి విధానం ఒకటి. ఇది చాలా ఉపశమనం ఇస్తుంది. పైగా దీని ప్రభావం కూడా త్వరగా ఉంటుంది.
వేగవంతమైన ఫలితాల కోసం, తేనె, అల్లం రసాన్ని వేడి నీటిలో కలుపుకుని తాగాలి.
2 టీ స్పూన్ల నిమ్మ రసం, నల్ల మిరియలు, ఉప్పును మిశ్రమంగా చేసుకుని ముక్కుపై అప్లై చేయడం ద్వారా ముక్కు దిబ్బడ సమస్య దూరమవుతుంది.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒకటి లేదా రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసి బాగా కలిపాలి. రోజుకు 3 పూటలా తాగితే ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది.