Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్… భారీగా తగ్గిన పసిడి ధర
Gold Rates: ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి ధర నేడు (శుక్రవారం) మరింత తగ్గి మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. తులం బంగారం ధర 62 వేల దిగువనే కొనసాగుతోంది.
దేశీయ మార్కెట్‌లో ఎల్లో మెటల్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.60,000 దిగువన వుంది.
దేశంలో బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 200 దిగొచ్చి.. రూ. 56,100కి చేరింది. గురువారం ఈ ధర రూ. 56,300గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 2000 తగ్గి, రూ. 5,61,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,610గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 220 తగ్గి.. రూ. 61,200కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 61,420గా ఉండేది.
అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 2200 దిగొచ్చి.. రూ. 6,12,000గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 6,120గా ఉంది.
అలాగే హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ 300 తగ్గి రూ.55800గా నమోదైంది.
Also Watch
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.60870గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సుకు 1,964.4 డాలర్లుగా ఉంది.
దేశ రాజధానిలో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 61,020, 22 క్యారెట్ (10 గ్రాములు) రూ. 55,950. చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 61,360 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) రూ. 56,250. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,800, 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,870గా ఉంది
అహ్మదాబాద్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,150గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 61,250గా కొనసాగుతోంది.
భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 56,100గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,200గా ఉంది.
ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
భారీగా తగ్గిన పసిడి ధర
పసిడి తగ్గుముఖం పట్టగా వెండి మాత్రం పరుగులు పెడుతుంది. ఈరోజు (శుకరువారం ) 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 130 పెరిగి.. రూ 28,300కి చేరింది.
ఆ ముందు రోజు ఈ ధర రూ. 28,170గా ఉండేది. ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 28,300గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
అయితే అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కూడా పసిడి, వెండి ధరలు తగ్గాయి. మే 12వ తేదీకి ముందు 2033 డాలర్ల వద్ద కొనసాగిన బంగారం ఒక్కసారిగా 24 డాలర్లకు పడిపోయింది.
తాజాగా ఇప్పుడు 1955 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్ 1955 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఏకంగా 78 డాలర్లు పతనమైంది.
భారతీయ కరెన్సీ ప్రకారం ఈ వారం రోజుల్లో సుమారు రూ. 6500 పతనమైంది. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఒక ఔన్సు 1984 డాలర్ల వద్ద కొనసాగింది.
ఇంతలా తగ్గడం ఈ నెలలో ఇదే తొలిసారి. నిన్నటితో పోల్చుకుంటే 29 డాలర్లు పతనమైంది. దీంతో 28 గ్రాముల స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం భారతీయ కరెన్సీలో రూ. 1,61,900 వద్ద కొనసాగుతోంది.
గ్రాము బంగారం అంతర్జాతీయ మార్కెట్లో రూ. 5,205 వద్ద కొనసాగుతుండగా.. 10 గ్రాముల బంగారం రూ. 52,050 వద్ద కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గాయి.
One thought on “Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్…”